నా టైం బాలేదు, అందుకే అలా... సునీల్ గవాస్కర్ కామెంట్లపై ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్...

First Published Jan 15, 2021, 10:42 AM IST

ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ టిమ్ పైన్... సిడ్నీ టెస్టు ఆఖరి రోజున భారత క్రికెటర్లతో ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. రవిచంద్రన్ అశ్విన్, హనుమ విహారిని సడ్జింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన టిమ్ పైన్... తాను దిగజారి ప్రవర్తించానని స్వచ్ఛంధంగా క్షమాపణలు కూడా చెప్పాడు. తాజాగా తనపై సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్లపై స్పందించాడు ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్.

రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వికెట్ల వెనకాల నోటికి పనిచెప్పిన టిమ్ పైన్... ‘గబ్బా టెస్టులో ఆడేందుకు ఎదురుచూస్తున్నా’ అంటూ కామెంట్ చేశాడు.
undefined
దానికి రవిచంద్రన్ అశ్విన్ ఘాటుగా రిప్లై ఇచ్చిన విషయం తెలిసిందే. ‘నువ్వు ఇండియా రా... నీకు అదే ఆఖరి సిరీస్ అవుతుంది’ అంటూ పైన్‌కి అశ్విన్ ఇచ్చిన రిప్లై హాట్ టాపిక్ అయ్యింది.
undefined
దాదాపు 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ కొనసాగించిన హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ జోడిని విడగొట్టేందుకు విశ్వప్రయత్నాలు చేశాడు టిమ్ పైన్. మాథ్యూ వేడ్‌తో కలిసి భారత క్రికెటర్లను యాక్షన్లతో భయపెట్టాలని ప్రయత్నించాడు.
undefined
విజయం కోసం దిగజారి ప్రవర్తించిన టిమ్‌ పైన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో తన ప్రవర్తన పట్ల తానే సిగ్గుపడుతున్నానంటూ ప్రకటించి, హుందాతనం చాటుకున్నాడు టిమ్ పైన్.
undefined
అయితే భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం ‘టిమ్ పైన్ ఆస్ట్రేలియాకి కెప్టెన్‌గా పనికి రాడు. కెప్టెన్ చేయాల్సిన పనులు కావు ఇవి. వెంటనే అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించండి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
undefined
సన్నీ గవాస్కర్ వ్యాఖ్యలపై స్పందించాడు టిమ్ పైన్... ‘సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాలను వ్యక్తం చేసి ఉండొచ్చు. అవి నా క్రికెట్‌పై ఎలాంటి ఎఫెక్ట్ చూపించవు...
undefined
నాకు తెలిసి, కెప్టెన్‌గా నేను కెరీర్ మొత్తం బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాను. కానీ సిడ్నీలో అనుకోకుండా అలా జరిగిపోయింది.
undefined
అక్కడ టైం బాలేదంతే...ఆడినన్ని మ్యాచులు విజయం కోసం ఆడతాం. ఎలాగైనా గెలవాలని అనుకుంటాం. కానీ ఆ రోజు అలా జరిగిపోయింది...’ అంటూ చెప్పుకొచ్చాడు టిమ్ పైన్.
undefined
సిడ్నీ టెస్టు మ్యాచ్‌లో జట్టును క్రమశిక్షణతో నడిపించడంలోనూ ఫెయిల్ అయిన టిమ్ పైన్.... మూడు క్యాచ్‌లను కూడా వదిలేశాడు.
undefined
click me!