INDvsAUS: అదరగొట్టిన అశ్విన్... కోహ్లీ సూపర్ క్యాచ్... లబుషేన్ లక్కీగా బతికిపోయాడు...

First Published Dec 18, 2020, 2:08 PM IST

పింక్ బాల్ టెస్టులో భారత బౌలర్లు అదరగొడుతున్నాడు. ముఖ్యంగా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటికే మూడు వికెట్లు తీసి, ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చాడు. బుమ్రా, పృథ్వీషా క్యాచులు డ్రాప్ చేయడంతో రెండుసార్లు బతికిపోయిన లబుషేన్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 79 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఆతిథ్య ఆస్ట్రేలియా, భారీ భాగస్వామ్యం కోసం పోరాడుతోంది.

మొదటి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకే ఆలౌట్ అయింది టీమిండియా. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ ఆరంభించనప్పటి నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు భారత బౌలర్లు...
undefined
ఎక్కడా పరుగులు చేయడానికి అవకాశం ఇవ్వకపోవడంతో మొదటి నాలుగు ఓవర్లలో పరుగులే రాలేదు... భారత ఇన్నింగ్స్ కంటే నెమ్మదిగా సాగింది ఆసీస్ ఇన్నింగ్స్...
undefined
మొదటి 14 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే చేసింది ఆస్ట్రేలియా. 51 బంతుల్లో 8 పరుగులు చేసిన మాథ్యూ వేడ్‌ను బుమ్రా అవుట్ చేసి, టీమిండియాకి తొలి బ్రేక్ అందించాడు...
undefined
ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ఓపెనర్ జో బర్న్స్ కూడా బుమ్రా బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు.. 29 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా..
undefined
ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్... 29 బంతుల్లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసి రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో రహానేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
undefined
టీమిండియాపై స్టీవ్ స్మిత్‌కి ఇదే అత్యల్ప వ్యక్తిగత స్కోరు. భారత జట్టుపై 21 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో ఇది మూడో సింగిల్ డిజిట్ స్కోరు...
undefined
ట్రావిస్ హెడ్ 20 బంతుల్లో 7 పరుగులు చేసి, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలయన్ చేరాడు...
undefined
ప్రాక్టీస్ మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌...24 బంతుల్లో 11 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
undefined
కొన్నాళ్లుగా క్యాచ్‌లు డ్రాప్ చేస్తున్న విరాట్ కోహ్లీ... గాల్లోకి ఎగురుతూ తనదైన స్టైల్‌లో అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు...
undefined
భారత ఫీల్డర్లు క్యాచ్ డ్రాప్ చేయడంతో రెండు సార్లు బతికిపోయిన లబుషేన్ 7 బౌండరీలతో హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు...
undefined
అతనితో పాటు ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్, వికెట్ కీపర్ టిమ్ పైన్ క్రీజులో ఉన్నాడు...
undefined
click me!