INDvsAUS: టీ20ల్లోనూ అదే తడబ్యాటు... భారత బ్యాట్స్‌మెన్ ఫెయిల్.. ఆస్ట్రేలియా ముందు ఈజీ టార్గెట్...

Published : Dec 04, 2020, 03:28 PM IST

INDvAUS: వన్డే సిరీస్‌ను కోల్పోయినా టీమిండియా ఆటతీరులో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా... ప్రత్యర్థికి భారీ టార్గెట్‌ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యింది. ఓపెనర్ కెఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నా... కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా ముకుమ్మడిగా విఫలం అయ్యారు. రవీంద్ర జడేజా ఆఖర్లో మెరుపులు మెరిపించడంతో ఓ మాదిరి స్కోరు అయినా చేయగలిగింది టీమిండియా. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది భారత జట్టు.

PREV
110
INDvsAUS: టీ20ల్లోనూ అదే తడబ్యాటు... భారత బ్యాట్స్‌మెన్ ఫెయిల్.. ఆస్ట్రేలియా ముందు ఈజీ టార్గెట్...

ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఇబ్బందిగా కనిపించిన శిఖర్ ధావన్ 6 బంతులు ఎదుర్కొని కేవలం సింగిల్ మాత్రమే తీసి పెవిలియన్ చేరాడు. 11 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా.

210

విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ కలిసి రెండో వికెట్‌కి 37 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే 9 బంతుల్లో 9 పరుగులు చేసిన విరాట్ స్వీపన్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

310

సంజూ శాంసన్ 15 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేశాడు. సంజూ శాంసన్ అవుటైన తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా...

410

మనీశ్ పాండే 8 బంతుల్లో 2 పరుగులు చేసి అవుట్ కాగా... 40 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 51 పరుగులు చేసిన కెఎల్ రాహుల్‌ కూడా ఆ తర్వాతి ఓవర్‌లోనే పెవిలియన్ చేరాడు...

510

టీమిండియా తరుపున 39 టీ20 ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడిన కెఎల్ రాహుల్‌కి ఇది 12వ హాఫ్ సెంచరీ...

610

39 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు కెఎల్ రాహుల్.

710

39 టీ20 ఇన్నింగ్స్‌లు ముగిసేసరికి విరాట్ కోహ్లీ (1552), ఆరోన్ ఫించ్ (1530), బాబర్ అజమ్ (1527) పరుగులు చేయగా కెఎల్ రాహుల్ 1512 పరుగులు చేశాడు. కెఎల్ రాహుల్ ఈ ఏడాది టీ20ల్లో వెయ్యి  పరుగులు కూడా పూర్తిచేసుకున్నాడు.

810

హార్ధిక్ పాండ్యా 15 బంతుల్లో 16 పరుగులు చేసి భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. 114 పరుగుల వద్ల ఆరో వికెట్ కోల్పోయింది టీమిండియా.

910

రవీంద్ర జడేజా మరోసారి అదరిపోయే ఇన్నింగ్స్‌తో టీమిండియాను ఆదుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ 7 పరుగులు చేయగా రవీంద్ర జడేజా 23 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 44 పరుగులు చేశాడు.

1010

ఆస్ట్రేలియా బౌలర్లలో హెండ్రిక్స్ మూడు వికెట్లు తీయగా, మిచెల్ స్టార్క్ రెండు, స్వీపన్, ఆడమ్ జంపా తలా ఓ వికెట్ తీశారు.

click me!

Recommended Stories