INDvAUS: ఐపీఎల్‌లో అలా... ఇప్పుడేమీ ఇలా... ప్లేట్ తిప్పేసిన క్రికెటర్లు...

First Published Nov 27, 2020, 12:13 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్ సూపర్ సక్సెస్ అయ్యింది. అనేక అడ్డంకులను దాటి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 2020 ఐపీఎల్ సీజన్‌లో కొందరు క్రికెటర్లు అద్భుత ప్రదర్శన ఇచ్చారు, మరికొందరు చిత్తుగా ఫెయిల్ అయ్యారు. అయితే ఐపీఎల్ తర్వాత ఆరంభమైన ఆస్ట్రేలియా, భారత్ వన్డే సిరీస్‌లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. అక్కడ అదరగొట్టిన బౌలర్లు ఇక్కడ తేలిపోగా, ఐపీఎల్ ఫెయిల్ అయిన క్రికెటర్లు సూపర్ హిట్ అయ్యారు.

ముంబై ఇండియన్స్ తరుపున ఆడిన జస్ప్రిత్ బుమ్రా... 15 మ్యాచుల్లో 27 వికెట్లు తీసి అదరగొట్టాడు.. అయితే ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి వన్డేలో బుమ్రా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు.
undefined
పవర్ ప్లేలో 4 ఓవర్లు వేసినా వికెట్ తీయలేకపోయిన బుమ్రా... షమీ కంటే ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాడు...
undefined

Latest Videos


బుమ్రా వేసిన ఆరు ఓవర్లలో రెండు వైడ్లు, ఓ నో బాల్ కూడా ఉండడం మరో విశేషం. బుమ్రాకి వన్డే సిరీస్‌లో విశ్రాంతి ఇవ్వాలని భావించిన టీమిండియా, లాస్ట్ మినెట్‌లో డెసిషన్ మార్చుకున్నట్టు సమాచారం.
undefined
అయితే 2020 ఏడాదిలో బుమ్రా ఒక్క వికెట్ లేకుండా వన్డేల్లో 44 ఓవర్లు బౌలింగ్ చేయడం అతని ఫామ్‌కి నిదర్శనం... టీ20ల్లో మాత్రం అదరగొడుతున్నాడు బుమ్రా...
undefined
మరోవైపు ఐపీఎల్ 2020 సీజన్‌లో ఘోరంగా ఫెయిల్ అయిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ మొదటి వన్డేలో అదరగొడుతున్నాడు...
undefined
డేవిడ్ వార్నర్‌తో కలిసి మొదటి వికెట్‌కి 156 పరుగుల భాగస్వామ్యం నెలకొల్సిన ఆరోన్ ఫించ్... 11వ సారి సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదుచేశాడు...
undefined
ఆస్ట్రేలియా జట్టు తరుపున ఇది మూడో అత్యధిక భాగస్వామ్య జోడి కాగా... ఓవరాల్‌గా ఆరో హైయెస్ట్ సెంచరీ పార్టనర్‌షిప్ ఓపెనింగ్ జోడీగా నిలిచాడు వార్నర్, ఆరోన్ ఫించ్...
undefined
టీమిండియాపై 13 మ్యాచుల్లోనే 1000 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్ జోడి అతి తక్కువ మ్యాచుల్లో ఈ ఫీట్ సాధించిన వన్డే ఓపెనింగ్ జోడిగా రికార్డు క్రియేట్ చేసింది.
undefined
ఐపీఎల్‌లో ఫెయిల్ అయిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ బ్యాటింగ్ చేస్తున్నాడు...
undefined
స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా ఆరోన్ ఫించ్ మొదటి వన్డే మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగాడు... స్మిత్ హాఫ్ సెంచరీ 37 బంతుల్లోనే రావడం మరో విశేషం.
undefined
ఐపీఎల్‌లో ఆడిన 14 మ్యాచుల్లో ఒక్క సిక్స్ కొట్టలేకపోయిన గ్లెన్ మ్యాక్స్‌వెల్.. సిక్సర్ల వర్షం కురిపించాడు. మరోవైపు ఐపీఎల్‌లో అదరగొట్టిన స్టోయినిస్ మొదటి వన్డేలో గోల్డెన్ డకౌట్ అయ్యాడు.
undefined
click me!