ఆసీస్ వన్డే సిరీస్ ఆరంభానికి ముందు ‘బేర్ ఫూట్ సర్కిల్’ పద్ధతిలో ఆచారాన్ని నిర్వహించింది క్రికెట్ ఆస్ట్రేలియా...
ఆస్ట్రేలియా ఆచారాల ప్రకారం ‘బేర్ ఫూట సర్కిల్’ అంటే ఓ వృత్తం చుట్టూ ఏడు చిన్నచిన్న వృత్తాలు ఉన్న డిజైన్ చుట్టూ ఇరు దేశాల క్రికెటర్లు బూట్లు, చెప్పులు లేకుండా నిలబడతారు..
భూమికి నిజమైన యజమానులైన వారిని గుర్తు చేసుకుంటూ ప్రత్యర్థులను, దేశాన్ని, దేశ ప్రజలను గౌరవించడానికి సంకేతంగా ఈ బేర్ ఫుట్ సర్కిల్ ఆచారం కొనసాగుతోంది...
2014లో ఆసీస్ యంగ్ ప్లేయర్ ఫిలిప్ హ్యూస్ ఇలాంటి గాయం కారణంగానే మైదానంలోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. క్రికెట్ చరిత్రలోనే ఇదో విషాదకర సంఘటన...
క్రికెట్ మైదానంలో ప్రాణాలు విడిచిన ఆస్ట్రేలియా యంగ్ బ్యాట్స్‌మెన్ ఫిలిప్ హ్యూజ్ చనిపోయిన రోజే ఆస్ట్రేలియా, ఇండియా మధ్య మొదటి వన్డే జరగనుంది...
ఆరేళ్ల క్రితం మరణించిన ఫిలిప్ హ్యూజ్‌తో పాటు ఐపీఎల్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన ఆసీస్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ డీన్ జోన్స్‌కి కూడా నివాళులు అర్పించారు ఇరు జట్ల క్రికెటర్లు...
‘ఫిలిప్ హ్యూజ్ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆస్ట్రేలియా క్రికెట్ బతికి ఉన్నంతవరకూ అతను బతికే ఉంటాడు. ఇప్పుడు క్రికెట్ ఆడుతున్న ప్లేయర్లతో పాటు ఫిలిప్‌తో కలిసి ఆడిన, ప్రత్యర్థిగా పోటీపడిన వారి గుండెల్లో కూడా అతను బతికే ఉన్నాడు’ అంటూ క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో నిక్ హాక్‌లీ నివాళి ఘటించాడు.
ఫిలిప్ హ్యూజ్, డీన్ జోన్స్‌కి నివాళిగా నల్ల రంగు బ్యాండ్లు ధరించిన క్రికెటర్లు ఓ నిమిషం పాటు మౌనం పాటించారు... స్కోరు బోర్డు మీద నివాళి వీడియో ప్రదర్శించారు.
ఆస్ట్రేలియాతో సిరీస్ నుంచి కొత్త జెర్సీలో మెరవనుంది టీమిండియా... ఆస్ట్రేలియా కూడా ఈ సిరీస్ నుంచి కొత్త జెర్సీలో కనిపించబోతోంది.
ఇరు జట్ల మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో టాస్ గెలిచిన ఆతిథ్య ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది.