టీమిండియాలో మరో ధోనీ... హార్ధిక్ పాండ్యాపై ప్రశంసల జల్లులు...

First Published Dec 7, 2020, 10:07 AM IST

మహేంద్ర సింగ్ ధోనీ... టీమిండియా తరుపున బెస్ట్ ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్న క్రికెటర్. కూల్ యాటిట్యూడ్‌తో ఎంతో తేలిగ్గా సిక్సర్లు బాదే మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత సరైన ఫినిషర్ లేక కొన్ని మ్యాచులు కోల్పోయింది టీమిండియా. అయితే ఆసీస్ టూర్‌లో ఆ లోటుకి ఓ సమాధానం దొరికింది. రవీంద్ర జడేజాతో పాటు ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కూడా బెస్ట్ ఫినిషర్‌గా పరిణతి సాధించాడు...

సిడ్నీలో జరిగిన మొదటి వన్డేలో, కాన్‌బెర్రాలో జరిగిన మూడో వన్డేలో 90, 92 పరుగులతో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు హార్ధిక్ పాండ్యా...
undefined
మొదటి వన్డేలో విజయాన్ని అందించలేకపోయినా మూడో వన్డేలో జడేజాతో కలిసి పాండ్యా చేసిన పరుగులే, భారత జట్టు విజయానికి కారణమయ్యాయి...
undefined
సిడ్నీలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యా ఆడిన ఇన్నింగ్స్ అసాధారణం. విరాట్ కోహ్లీ అవుట్ అయ్యే సమయానికి భారత జట్టు విజయానికి 23 బంతుల్లో 46 పరుగులు కావాలి...
undefined
అప్పటిదాకా సింగిల్స్ తీస్తూ విరాట్ కోహ్లీకి స్టైయికింగ్ ఇవ్వడానికే ప్రాధాన్యం ఇచ్చిన పాండ్యా, ఆ తర్వాత గేరు మార్చాడు... తొందర పడకుండా క్లిష్టమైన బాల్స్‌ను వదిలేస్తూ, అవకాశం దొరికిన బంతులను బౌండరీ అవతలకి పంపించాడు...
undefined
చివరి 12 బంతుల్లో 25 పరుగులు కావాల్సిన దశలో భారీ హిట్టింగ్ చేసే బాధ్యత తీసుకున్న పాండ్యా, అయ్యర్‌పై భారం వేసే రిస్క్ తీసుకోలేదు...
undefined
22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులు చేసన హార్ధిక్ పాండ్యా... సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా దక్కించుకున్నాడు.
undefined
‘హార్ధిక్ పాండ్యా చాలా ప్రమాదకర బ్యాట్స్‌మెన్. ఇంతకుముందు మహేంద్ర సింగ్ ధోనీ టీమిండియాకి ఫినిషర్‌లా ఉండేవాడు. ఇప్పుడు ఆ ప్లేస్ పాండ్యా తీసుకున్నాడు. టీమిండియాకు మరో ధోనీ దొరికేసినట్టే’ అంటూ చెప్పుకొచ్చాడు ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్.
undefined
‘విరాట్ కోహ్లీ చాలా అద్భుతమైన ఆటగాడు. అతను ఆడిన షాట్స్ చాలా బాగున్నాయి. పాండ్యాను కరెక్టుగా వాడుకుంటే మరో ధోనీలా మారతాడు’ అంటూ కామెంట్ చేశాడు లాంగర్.
undefined
మూడు వన్డేల సిరీస్‌లో 210 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా... టీమిండియా తరుపున వన్డే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు.
undefined
‘ఏ బౌలర్‌ను ఎప్పుడు టార్గెట్ చేయాలో పాండ్యాకు బాగా తెలుసు. ఫాస్ట్ బౌలర్లపై సింగిల్స్ తీస్తూ, స్పిన్నర్లపై బౌండరీలు బాదుతూ దాడి చేస్తాడు. ప్రెషర్ పెంచేసి బౌలర్లతో లూజ్ బాల్స్ వేయిస్తాడు... ఆండ్రూ రస్సెల్ కంటే హార్ధిక్ పాండ్యా బెస్ట్ ఫినిషర్’ అంటూ కామెంట్ చేశాడు భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్.
undefined
click me!