బుమ్రాను అండర్సన్ అలా తిట్టాడని చెప్పిన తర్వాతే... శార్దూల్ ఠాకూర్ కామెంట్స్...

First Published Sep 17, 2021, 4:45 PM IST

చప్పగా సాగుతున్న ఇంగ్లాండ్, ఇండియా టెస్టు సిరీస్‌లో అగ్గి రాజేసిన సంఘటన జస్ప్రిత్ బుమ్రా - జేమ్స్ అండర్సన్ ఎపిసోడ్. లార్డ్స్ టెస్టులో జరిగిన ఈ సంఘటన తర్వాత ఓటమి అంచున ఉన్నట్టుగా కనిపించిన టీమిండియా, చిరుత పుల్లుల్లా విరుచుకుపడి విజయం అందుకోవడానకి కారణమైంది...

లార్డ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన జేమ్స్ అండర్సన్‌కి బౌన్సర్లు వేస్తూ, తెగ ఇబ్బందిపెట్టాడు జస్ప్రిత్ బుమ్రా... 

బుమ్రా బౌలింగ్‌లో సరిగ్గా 10 బంతులు ఎదుర్కొన్న అండర్సన్... అతన్ని ఎదుర్కోవడానికి బాగా ఇబ్బంది పడ్డాడు. బుమ్రా వేసిన బౌన్సర్లు, అండర్సన్ శరీరానికి బలంగా తాకాయి...

మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఆ రోజు ఆట ముగిసే ఆఖరి బంతికి అవుటైన అండర్సన్... పెవిలియన్‌కి వెళుతూ జస్ప్రిత్ బుమ్రాపై నోరు పారేసుకోవడంతో హై డ్రామా మొదలైంది...

‘మేం తొలి ఇన్నింగ్స్‌లో అండర్సన్‌ను అటాక్ చేయాలని ఫిక్స్ అయ్యాం. ఓవల్ టెస్టు దాకా ఇదే ప్లానింగ్‌తో ఉన్నాం... 

వాస్తవానికి లార్డ్స్ టెస్టులో బుమ్రాను అండర్సన్ ఏదో తిట్టాడని, అది పబ్లిక్‌లో మాట్లాడలేని బూతు అని నాకు తెలిసింది... 

బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బుమ్రాను ఇంగ్లాండ్ టీమ్ తిట్టిందనే విషయం తెలిసిన తర్వాత జట్టులో ప్రతీ ఒక్కరూ రగిలిపోయారు...

ఈ సంఘటన తర్వాత మాలో గెలుపు కసి రెండింతలు పెరిగింది. అదే రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను అంతలా అటాక్ చేయడానికి కారణమైంది...’ అంటూ కామెంట్ చేశాడు శార్దూల్ ఠాకూర్...

‘విదేశాల్లో ఆడేటప్పుడు మా టెయిలెండర్లు కూడా బౌన్సర్లు ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఏ మాత్రం ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన అనుభవం కూడా లేని నటరాజన్‌, ఆసీస్ టూర్‌లో కమ్మిన్స్, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో బౌన్సర్లను ఎదుర్కొన్నాడు...

అలాంటప్పుడు మేం మాత్రం ఎందుకు ప్రత్యర్థి టెయిలెండర్లను వదిలేయాలి. మేం కూడా అలాగే వేయాలని ఫిక్స్ అయ్యాం.. అదే ఫాలో అవుతాం...’ అంటూ కామెంట్ చేశాడు శార్దూల్ ఠాకూర్...

click me!