వాళ్లు రిటైర్ అయ్యాక, టీమ్‌లో ఉండలేకపోయా! నా రిటైర్మెంట్‌కి కారణం అదే... - ఏబీ డివిల్లియర్స్

Published : Jul 01, 2023, 11:46 AM IST

2019 వన్డే వరల్డ్ కప్‌ కోసం టీమ్‌ని సిద్ధం చేస్తున్న సమయంలో సడెన్‌గా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి, అందర్నీ షాక్‌కి గురి చేశాడు ‘మిస్టర్ 360’ ఏబీ డివిల్లియర్స్. ఏబీడీ రిటైర్మెంట్‌ షాక్ నుంచి కోలుకోవడానికి సౌతాఫ్రికాకి చాలా సమయం పట్టింది...  

PREV
19
వాళ్లు రిటైర్ అయ్యాక, టీమ్‌లో ఉండలేకపోయా! నా రిటైర్మెంట్‌కి కారణం అదే...  - ఏబీ డివిల్లియర్స్

వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న సౌతాఫ్రికా పరిస్థితి చూసిన ఏబీ డివిల్లియర్స్, తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి రావాలని అనుకున్నాడు. అయితే సఫారీ క్రికెట్ బోర్డు అందుకు అంగీకరించలేదు..

29

వన్డే వరల్డ్ కప్‌కి ఏడాది ముందు ఏబీ డివిల్లియర్స్‌ రిటైర్మెంట్ తీసుకోవడానికి కారణం ఏంటి? తాజాగా రాబిన్ ఊతప్ప హోస్ట్ చేసిన ‘హోమ్ ఆఫ్ హీరోస్’ కార్యక్రమంలో ఈ విషయాల గురించి బయటపెట్టాడు ఏబీ డివిల్లియర్స్..
 

39
AB de Villiers

‘నిజం చెప్పాలంటే ఆ సమయంలో సౌతాఫ్రికా క్రికెట్ టీమ్‌ వాతావరణంలో నేను ఇమడలేకపోయాను. నాకు కావాల్సిన టీమ్ సెటప్‌ని మిస్ అయ్యాను. బ్రౌచర్, స్మిత్, కలీస్ వంటి ప్లేయర్లు రిటైర్ అయిపోయాక టీమ్‌లో నాకు బెస్ట్ ఫ్రెండ్స్ లేకుండా పోయారు..

49
Graeme Smith Mark Boucher AB de Villiers

వాళ్లంతా రిటైర్ అయ్యేసరికి టీమ్‌లో ఏదో వెలితి. టీమ్‌లో ఉన్నవారిలో చాలామంది నాకంటే చిన్నవాళ్లు, మరికొందరు చాలా తక్కువ మ్యాచులు ఆడినవాళ్లు. సీనియర్‌గా నేనే ముందుండి నడిపించాల్సిన పరిస్థితి. కొన్ని రోజులు దాన్ని బాగా ఎంజాయ్ చేశాను..

59

అయితే కనీసం 4-5 క్లోజ్ ఫ్రెండ్స్ అయినా లేకపోతే జట్టును నడిపించడం చాలా కష్టం. నాకూ అదే సమస్యగా మారింది. చాలా క్లోజ్‌గా గమనిస్తే టీమ్‌లో నేను సెట్ కావడం లేదని తెలుసుకున్నా. నా వల్లే జట్టు సమతుల్యం దెబ్బ తినకూడదని టీమ్ నుంచి తప్పుకున్నా... 

69

నాకు గణాంకాలంటే అస్సలు ఇష్టం ఉండదు. లెక్కలంటే చిన్నప్పటి నుంచి అసహ్యమే. వన్డేల్లో 10 వేల పరుగులు చేయాల్సిందిగా అని చాలా మంది అన్నారు. అయితే నేనెప్పుడూ ఆ ఫిగర్‌ని లెక్కచేయలేదు. నేను ఎన్ని పరుగులు చేశానో అవి చాలని అనిపించింది..
 

79
Dale Steyn-AB de Villiers

ఆ సమయంలో నేను రిటైర్మెంట్ తీసుకోవడానికి నా దగ్గర 20 కారణాలు ఉన్నాయి. అందులో కొన్ని వ్యక్తిగత కారణాలు కూడా. అప్పుడే రిటైర్మెంట్ తర్వాత నాలుగేళ్లు ఐపీఎల్‌ ఆడాలి, ఆర్‌సీబీ తరుపున క్రికెట్ ఆడి రిటైర్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నా...’ అంటూ కామెంట్ చేశాడు ఏబీ డివిల్లియర్స్...

89

సౌతాఫ్రికా క్రికెట్ టీమ్‌కి కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన ఏబీ డివిల్లియర్స్, 228 వన్డేలు ఆడి 25 సెంచరీలు, 53 హాఫ్ సెంచరీలతో 9577 పరుగులు చేశాడు. 114 టెస్టుల్లో 8765 పరుగులు చేశాడు. 

99

78 టీ20 మ్యాచుల్లో 1672 పరుగులు చేసిన ఏబీడీ, ఐపీఎల్‌లో 5 వేలకు పైగా పరుగులు చేసిన రెండో విదేశీ బ్యాటర్‌గా ఉన్నాడు.. ఆప్తమిత్రుడు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆఖరిగా 2021 సీజన్ ఆడిన ఏబీ డివిల్లియర్స్, ప్రస్తుతం ఆర్‌సీబీకి కోచింగ్ స్టాఫ్‌లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.. 

click me!

Recommended Stories