విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలనుకుంటే, అదే చాలా పెద్ద క్రైమ్...

First Published Jun 25, 2021, 3:44 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమితో మరోసారి భారత సారథి విరాట్ కోహ్లీని ట్రోల్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అజింకా రహానే ఫ్యాన్స్... కోహ్లీని వెంటనే కెప్టెన్సీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు...

గత ఐదు ఏళ్లుగా టీమిండియాను, వరల్డ్ నెం.1 టెస్టు టీమ్‌గా నిలిపిన భారత సారథి విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగించాలని భావించడం... చాలా పెద్ద నేరంగా మారుతుందని కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్...
undefined
‘విరాట్ కోహ్లీ ఓ అసాధారణ ఛాంపియన్ ప్లేయర్. ప్రస్తుత తరంలో అతనో క్రికెట్ సూపర్ స్టార్. కోహ్లీ, భారత జట్టుకి ఓ దృఢత్వాన్ని తీసుకొచ్చాడు...
undefined
టీమిండియా బౌలింగ్ చేసేటప్పుడు వికెట్ తీసినప్పుడు విరాట్ కోహ్లీ ఆనందం, ఆవేశం చూస్తే... అతను జట్టుకి ఎంతగా అవసరమో అర్థం అవుతుంది...
undefined
జట్టులో ఒక్క మిస్ ఫీల్డ్ కానీ, ఒక్క క్యాచ్ డ్రా జరిగినా కోహ్లీ చాలా ఫీల్ అవుతాడు. ఎందుకంటే అతను కెప్టెన్‌గా నూటికి 200 శాతం కమిట్ అయిపోయాడు...
undefined
విరాట్ కోహ్లీలాంటి కెప్టెన్‌ని సంపాదించడం, తయారుచేయడం దాదాపు అసాధ్యం. అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించాలని భావిస్తే అది టీమిండియాకి చాలా చేటు చేస్తుంది. అది క్షమించరాని నేరం కూడా...
undefined
ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత జట్టు మరో కెప్టెన్ కోసం చూస్తారని కూడా నేను అనుకోవడం లేదు. నాకు తెలిసి ఫైనల్‌లో టీమిండియా ఓటమికి వారికి సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడమే కారణం.
undefined
సౌంతిప్టన్‌లో వాళ్లు నెట్ ప్రాక్టీస్ చేశారు కానీ మ్యాచ్ ప్రాక్టీస్ మాత్రం లేదు. ఐపీఎల్ నుంచి నేరుగా సౌంతిప్టన్ చేరుకోవడంతో వారికి కావాల్సినంత ప్రాక్టీస్ దొరకలేదు...
undefined
అదే న్యూజిలాండ్‌కి అన్నీ కలిసి వచ్చాయి. వాతావరణంతో పాటు ఇంగ్లాండ్‌తో ఆడిన రెండు టెస్టుల సిరీస్ కూడా న్యూజిలాండ్ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి...
undefined
ఫైనల్‌ మ్యాచ్‌లో ఐదు రోజుల పాటు వర్షం అంతరాయం కలిగించింది. అది కూడా భారత జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడే ఎక్కువగా జరిగింది. అది మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ గ్రేమ్ స్వాన్.
undefined
click me!