PSL 2021 విజేత ముల్తాన్ సుల్తాన్స్... ఫైనల్‌లో పెషావర్ జల్మీపై విజయం...

కరోనా కారణంగా వాయిదా పడి, తిరిగి ప్రారంభమైన పాక్ సూపర్ లీగ్ విజయవంతంగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లో పెషావర్ జల్మీని ఓడించిన ముల్తాన్ సుల్తాన్స్... తొలిసారి పీఎస్‌ఎల్ టైటిల్ గెలిచింది...

ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పెషావర్ జల్మీ, ముల్తాన్ సుల్తాన్స్‌కి బ్యాటింగ్ అప్పగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 పరుగుల భారీ స్కోరు చేసింది.
మసూద్ 29 బంతుల్లో 6 ఫోర్లతో 37, రిజ్వాన్ 30 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 30 పరుగులు, మక్సూద్ 35 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు, రోసక్ 21 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేశారు...

207 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన పెషావర్ జల్మీ, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 159 పరుగులకే పరిమితమైంది.
షోయబ్ మాలిక్ 28 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 48 పరుగులు చేయగా, కమ్రాన్ అక్మల్ 28 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 36 పరుగులు చేశారు. మిగిలిన ప్లేయర్లు ఎవ్వరూ పెద్దగా రాణించలేదు.
దీంతో 47 పరుగుల భారీ తేడాతో టైటిల్ గెలిచిన ముల్తాన్ సుల్తాన్స్... పీఎస్‌ఎల్ టైటిల్ గెలిచిన ఐదో జట్టుగా నిలిచింది.
2016లో ఇస్లామాబాద్ యునైటెడ్, 2017లో పెషావర్ జల్మీ, 2018లో రెండోసారి ఇస్లామాబాద్ యునైటెడ్ టైటిల్ గెలవగా, 2019లో క్వెట్టా గ్లాడియేటర్స్, 2020లో కరాచీ కింగ్స్ టైటిల్స్ సాధించాయి.
సుల్తాన్ ముల్తాన్స్ ప్లేయర్ సోహెబ్ మక్సూద్, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలిచాడు.

Latest Videos

click me!