ధోనీ, విరాట్ వల్ల కానిది, పృథ్వీషా చేసి చూపించాడు... గత 8 ఏళ్లలో ఒకే ఒక్క కెప్టెన్‌గా...

First Published Jun 25, 2021, 3:03 PM IST

క్రికెట్‌లో కొన్ని సెంటిమెంట్స్ మరీ విచిత్రంగా ఉంటాయి. ప్రస్తుతం క్రికెట్‌నూ, రాజకీయాలను పోల్చి చూస్తూ చిత్రవిచిత్రమైన ట్రోల్స్ చేస్తున్నారు టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్... 

2014లో భారత ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీమిండియా... ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయింది... భారత పురుషుల జట్టే కాదు, మహిళల జట్టుదీ ఇదే పరిస్థితి...
undefined
టీమిండియాకి మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా గుర్తింపు దక్కించుకున్న మహేంద్ర సింగ్ ధోనీ కూడా మోదీ హయాంలో ఐసీసీ టైటిల్ గెలవలేకపోవడం విశేషం...
undefined
2014 టీ20 వరల్డ్‌కప్‌లో ఫైనల్ చేరిన టీమిండియా, ఆఖరి ఆటలో శ్రీలంకతో ఓడి రన్నరప్‌గా నిలిచింది... ఆ తర్వాత 2016 టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఇదే పరిస్థితి...
undefined
2017 ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాక్ చేతిలో చిత్తుగా ఓడగా, 2019 వరల్డ్ కప్‌లో సెమీస్‌లోనే కథ ముగిసింది...
undefined
2021 వరల్డ్ టెస్టు ఛాంపియన్‌‌షిప్ ఫైనల్‌లోనూ నిరాశే ఎదురైంది. అత్యద్భుతమైన ఆటతీరుతో సంచలన విజయాలతో ఫైనల్ చేరినా, ఆఖరి ఆటలో మాత్రం చేతుల్లేతేసింది టీమిండియా...
undefined
అండర్ 19 వరల్డ్‌కప్‌లోనూ ఇదే పరిస్థితి. ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో బంగ్లాదేశ్‌లో అండర్ 19 వరల్డ్‌కప్ ఆడిన టీమిండియా, ఫైనల్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది.
undefined
2020 అండర్‌19 వరల్డ్‌కప్‌లోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ప్రియమ్ గార్గ్ కెప్టెన్సీలో భారత జట్టు, ఫైనల్‌లో బంగ్లాదేశ్ చేతుల్లో ఓడడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...
undefined
పురుషుల జట్టే ఇలా అనుకుంటే మహిళల జట్టూ బ్యాడ్‌లక్ వెంటాడింది. 2016లో మహిళల టీ20 వరల్డ్‌కప్‌కి ఆతిథ్యం ఇచ్చిన టీమిండియా, ఐదో స్థానానికే పరిమితమైంది.
undefined
2017 వన్డే వరల్డ్‌కప్‌లో మిథాలీరాజ్ కెప్టెన్సీలోని టీమిండియా ఫైనల్ చేరింది. అయితే ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది...
undefined
2018 టీ20 వరల్డ్‌కప్‌లో గ్రూప్ స్టేజ్‌లో టాపర్‌గా నిలిచిన టీమిండియా, సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతుల్లో ఓడింది. 2020 టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా చేతుల్లో ఓడి, రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
undefined
అయితే విచిత్రంగా నరేంద్ర మోదీ, స్నేహితుడు, ఆత్మీయుడు, కేంద్ర మంత్రి అయిన అమిత్ షా పేరులోని షాను ఇంటిపేరుగా పెట్టుకున్న పృథ్వీషా... బీజేపీ హయాంలో ఐసీసీ టైటిల్ గెలిచిన ఒకేఒక్క కెప్టెన్‌గా నిలిచాడు.
undefined
2018 అండర్19 వరల్డ్‌కప్‌లో పృథ్వీషా కెప్టెన్సీలోని టీమిండియా, రాహుల్ ద్రావిడ్ కోచింగ్‌లో టైటిల్ గెలిచింది...
undefined
click me!