రాహుల్ ద్రావిడ్ కోచ్ కావాలనుకుంటే, ‘వార్ వన్‌సైడే...’... మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...

First Published Jul 22, 2021, 3:08 PM IST

భారత ప్రధాన రవిశాస్త్రి కాంట్రాక్ట్ గడువు దగ్గరపడుతుండడం, శ్రీలంక టూర్‌కి కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ ఎన్నిక కావడంతో టీమిండియా తర్వాతి కోచ్ ఎవరనే విషయం గురించి చాలా పెద్ద చర్చే జరుగుతోంది. 

భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ టీమిండియా కోచ్ కావాలని అనుకుంటే, ఆయనకి ఎలాంటి పోటీ ఉండదని అంటున్నాడు భారత మాజీక్రికెటర్ ఆకాశ్ చోప్రా..
undefined
‘భారత జట్టు కోచ్‌ లిస్టులో రాహుల్ ద్రావిడ్ తన పేరును పెట్టబోతున్నాడని నేను అనుకోవడం లేదు. ఒకవేళ రాహుల్ ద్రావిడ్ నిజంగా భారత జట్టుకి కోచ్‌గా కావాలని అనుకుంటే, వార్ వన్‌సైడ్ అయిపోతుంది.
undefined
భారత అండర్19 జట్టుకి, భారత్ ఏ జట్టుకి ఎన్నో విజయాలు అందించిన రాహుల్ ద్రావిడ్ పోటీలో నిలబడితే, ఆయనకే విజయం దక్కుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...
undefined
శ్రీలంక టూర్‌కి కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ ఎంట్రీ ఇవ్వడంతో ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్న భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతూ ఉండవచ్చని భారత మాజీ క్రికెటర్ రితిందర్ సోదీ కామెంట్ చేసిన విషయం తెలిసిందే...
undefined
తొలి వన్డేలో పూర్తి ఆధిపత్యం చూపించిన టీమిండియా, రెండో వన్డేలో వీరోచిత పోరాటంతో విజయం సాధించింది. ఓటమి ఖాయమనుకున్న తరుణంలో దీపక్ చాహార్, భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా పోరాడి భారత జట్టుకి విజయం అందించారు.
undefined
ఈ విజయంతో భారత జట్టు పర్ఫామెన్స్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. రవిశాస్త్రి కోచింగ్‌లోని విరాట్ సేనను కూడా రాహుల్ ద్రావిడ్ కోచింగ్‌లోని ధావన్ సేన ఓడించగలదని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్..
undefined
విరాట్ ఎలెవన్, శిఖర్ ధావన్ ఎలెవన్ జట్ల మధ్య ఓ మ్యాచ్ పెట్టాలని డిమాండ్లు కూడా చేస్తున్నారు. ధావన్ టీమ్ కంటే విరాట్ కోహ్లీ టీమ్ బలహీనమైనదని కొందరు క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండడం విశేషం.
undefined
click me!