Shahid Afridi: తనపై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ దానిష్ కనేరియా చేస్తున్న వరుస ఆరోపణలపై షాహిద్ అఫ్రిది స్పందించాడు. కనేరియా ఇవన్నీ చిల్లర కోసం చేస్తున్నాడని, శత్రుదేశం ముందు తనను అబాసుపాలు చేస్తున్నాడని వ్యాఖ్యానించాడు.
గడిచిన వారం రోజులుగా తనపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా కు పాక్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది ధీటుగా బదులిచ్చాడు. కనేరియా ఆరోపించినట్టు తాను అంత చెడ్డవాన్నే అయితే మరి అప్పుడే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించాడు.
26
అఫ్రిది మాట్లాడుతూ.. ‘అతడు (కనేరియా) నాకు సోదరుడి వంటి వాడు. అయితే చీప్ పబ్లిసిటీ సంపాదించి డబ్బులు సంపాదించాలనే తలంపుతో ఏది పడితే అది వాగుతున్నాడు.
36
నన్ను అబద్దాల కోరు అని, క్యారెక్టర్ లేనివాడు అనే ముందు అతడి క్యారెక్టర్ ఏంటో చూసుకుంటే బాగుంటుంది. ఒకవేళ నేను అతడిపై ఏదైనా వివక్షా పూరితంగా వ్యవహరించి ఉంటే.. చెడుగా ప్రవర్తిస్తే అప్పుడే పీసీబీకి ఎందుకు ఫిర్యాదు చేయలేదు..?
46
అతడు మన శత్రు దేశం (భారత్ కు సంబంధించిన ఓ ప్రముఖ మీడియా సంస్థకు కనేరియా ఇంటర్వ్యూ ఇచ్చిన నేపథ్యంలో స్పందిస్తూ..) మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి అక్కడ మత చిచ్చు రగిలిస్తున్నాడు..’ అని ఘాటుగా సమాధానమిచ్చాడు.
56
కాగా పాకిస్తాన్ జట్టులో అఫ్రిది వల్ల తాను చాలా ఇబ్బందులు ఎదుర్కున్నానని, అతడు తనను జట్టులోంచి తీసేయడానికి కుట్రలు పన్నాడని ఇటీవలే కనేరియా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
66
అంతేగాక తాను హిందువును అవడం వల్లే అఫ్రిది ఇలా చేశాడని, తనను పదే పదే ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి తెచ్చాడని సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో అఫ్రిది పై విధంగా స్పందించాడు.