2019లో మాంచెస్టర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. భువనేశ్వర్ కుమార్ 10 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు.
India vs New Zealand 2019 World Cup
ఈ లక్ష్యం పెద్ద కష్టమైనదేమీ కాదు. అయితే కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ముగ్గురూ కూడా ఒక్కో పరుగు చేసి అవుట్ అయ్యారు. దినేశ్ కార్తీక్ 6 పరుగులు చేసి అవుట్ కావడంతో 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది భారత్. రిషబ్ పంత్ 32, హార్ధిక్ పాండ్యా 32 పరుగులు చేసి అవుట్ కాగా ఎమ్మెస్ ధోనీ, రవీంద్ర జడేజా కలిసి ఏడో వికెట్‌కి 116 పరుగులు జోడించారు..
Dhoni
59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేసిన జడ్డూ వేగంగా ఆడుతుంటే ఎమ్మెస్ ధోనీ 72 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 50 పరుగులు చేశాడు. భారీ షాట్స్ ఆడేందుకు లెంగ్త్ బాల్స్ పడినా కూడా ధోనీ డిఫెన్స్ ఆడడం హాట్ టాపిక్ అయ్యింది.
2011 వన్డే వరల్డ్ కప్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి, క్రెడిట్ మొత్తం కొట్టేసిన మాహీ, 2019 వన్డే వరల్డ్ కప్‌లో ఎందుకు ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాడు? అనేది చాలామందికి అర్థం కాలేదు. మాహీ ఇన్నింగ్స్‌పై విమర్శల వర్షం వస్తూనే ఉంది. 2023 వరల్డ్ కప్ సెమీస్‌కి ముందు మరోసారి ఈ మ్యాచ్ గురించి చర్చ జరుగుతోంది...
‘2019 వన్డే వరల్డ్ కప్ సెమీస్‌లో మాహీ కావాలనే సరిగ్గా ఆడలేదు. టీమిండియా, వరల్డ్ కప్ గెలవకూడదనేదే మాహీ కోరిక. ఎందుకంటే తన కెప్టెన్సీలో భారత జట్టు, వరల్డ్ కప్ గెలిచింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో వరల్డ్ కప్ గెలిస్తే, తనకు విలువ తగ్గిపోతుందని ధోనీ అనుకున్నాడు.
వరల్డ్ కప్‌లో అతని ఇన్నింగ్స్ చూస్తే, క్లియర్‌గా ఈ విషయం అర్థం అవుతుంది. జడేజా ఫ్రీగా షాట్లు ఆడుతుంటే, మాహీ మాత్రం కావాలని డాట్ బాల్స్ ఆడుతూ అతనిపై ప్రెషర్ పెంచాడు. కనీసం స్ట్రైయిక్ రొటేట్ చేసి ఉన్నా, మ్యాచ్ సునాయాసంగా ముగిసి ఉండేది..
ధోనీ చాలా ఐపీఎల్ మ్యాచుల్లో ఆఖరి ఓవర్‌లో 20-25 పరుగులు ఫినిష్ చేశాడు. ఐపీఎల్ 2019 సీజన్‌లో కూడా బాగా ఆడాడు. కానీ వరల్డ్ కప్‌లో మాత్రం కావాలని జిడ్డు బ్యాటింగ్ చేశాడు. హార్ధిక్ పాండ్యా అవుట్ కావడానికి, జడేజా అవుట్ కావడానికి కూడా ధోనీయే కారణం.
India vs New Zealand
ఇంత కుల్లు ఉన్న క్రికెటర్‌ని నేనెప్పుడూ చూడలేదు. మాహీ ఆ మ్యాచ్‌లో తన సత్తాలో 50 శాతం వాడి ఉన్నా, టీమిండియా ఫైనల్‌కి వెళ్లి ఉండేది. ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ని ఓడించడం టీమిండియాకి పెద్దకష్టమయ్యేది కాదు...’ అంటూ కామెంట్ చేశాడు యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్..