India vs New Zealand
2019 వన్డే వరల్డ్ కప్‌లో టేబుల్ టాపర్‌గా నిలిచిన భారత జట్టు, సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడింది. మళ్లీ నాలుగేళ్ల తర్వాత సెమీస్‌లో న్యూజిలాండ్‌తోనే తలబడనుంది టీమిండియా...
నాలుగేళ్ల క్రితం మాంచెస్టర్‌లో ఎదురైన పరాభవానికి ముంబైలో భారత జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటున్నారు అభిమానులు. అయితే వాంఖడే స్టేడియంలో టీమిండియాకి చెప్పుకోదగ్గ రికార్డు లేదు..
2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడింది ఇక్కడే. అయితే ఫైనల్ దాకా వెళ్లడం సంగతి పక్కనబెడితే వాంఖడేలో ఆడిన మూడు సెమీ ఫైనల్స్‌లోనూ భారత జట్టుకి పరాజయమే ఎదురైంది..
1983 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు, డిఫెండింగ్ ఛాంపియన్‌గా 1987 వరల్డ్ కప్ ఆడింది. గ్రూప్ స్టేజీలో మంచి పర్ఫామెన్స్ చూపించిన టీమిండియా, వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో ఓడింది..
1987లో ఆరు జట్లతో కలిసి నెహ్రా కప్ (MRF వరల్డ్ సిరీస్) టోర్నీ ఆడింది భారత జట్టు. ముంబైలో జరిగిన సెమీస్‌లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. టీమిండియాని ఓడించి ఫైనల్ చేరిన వెస్టిండీస్, పాకిస్తాన్ చేతుల్లో పరాజయం పాలైంది.
Virat Kohli Bowling
2016 టీ20 వరల్డ్ కప్‌లో చివరిగా ఇండియా, వాంఖడే స్టేడియంలో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 47 బంతుల్లో 89 పరుగులు చేసి అదరగొట్టడంతో 192 పరుగుల భారీ స్కోరు చేసింది టీమిండియా. అయితే బౌలర్లు చేతులు ఎత్తేయడంతో వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో గెలిచింది..
ఈ పరాజయం తర్వాత ఏడేళ్లకు మళ్లీ ముంబైలోని వాంఖడే స్టేడియంలో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడుతోంది టీమిండియా. మూడు సార్లు, మూడ్‌ని చెడగొట్టిన వాంఖడే, ఈసారి కచ్ఛితంగా 2011 వరల్డ్ కప్ ఫైనల్ మూమెంట్స్‌ని రీక్రియేట్ చేయాలని ఆశపడుతున్నారు అభిమానులు..