టాస్ కాదు, మ్యాచ్‌ని డిసైడ్ చేసేది మొదటి 10 ఓవర్లే! ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీ ఫైనల్‌పై...

First Published | Nov 14, 2023, 5:14 PM IST

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ లీగ్ స్టేజీలో అన్ని మ్యాచుల్లో గెలిచి, అజేయంగా సెమీస్‌కి చేరింది భారత జట్టు. సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలబడనుంది. 2003 వన్డే వరల్డ్ కప్ తర్వాత 2019 వన్డే వరల్డ్ కప్‌ సెమీస్‌లో ఇండియా, న్యూజిలాండ్‌తో తలబడింది. 

నాలుగేళ్ల తర్వాత రివెంజ్ తీర్చుకోవడం కోసం భారత జట్టు, ముచ్ఛటగా మూడోసారి వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌కి వెళ్లాలని న్యూజిలాండ్... తహతహలాడుతున్నాయి. 2021 టీ20 వరల్డ్ కప్‌లో టాస్ గెలిచిన జట్లకే విజయాలు వరించాయి..

2022 టీ20 వరల్డ్ కప్‌లోనూ టాస్ కీలక పాత్ర పోషించింది. అయితే 2023 వన్డే వరల్డ్ కప్‌లో టాస్‌తో సంబంధం లేకుండా విజయాలు అందుకుంటూ వచ్చింది భారత జట్టు. 
 

Latest Videos


మొదటి ఐదు మ్యాచుల్లో రెండో సారి బ్యాటింగ్ చేసి విజయాలు అందుకున్న టీమిండియా, ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్ చేసి భారీ విజయాలు అందుకుంది..
 

కాబట్టి ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగే సెమీ ఫైనల్‌లో  టాస్ పాత్ర నామమాత్రమే. మొదటి 10 ఓవర్ల ఆటే మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేయనుంది. తొలుత బ్యాటింగ్ చేయాల్సి వస్తే... రోహిత్ శర్మ, టీమిండియాకి కీలకం అవుతాడు..
 

130+ స్ట్రైయిక్ రేటుతో దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న రోహిత్, మొదటి 10 ఓవర్ల పాటు వికెట్ పారేసుకోకుండా భారత జట్టు స్కోరు ఈజీగా పవర్ ప్లేలో 90+ పరుగులు చేస్తుంది. ఇది ప్రత్యర్థి బౌలర్లపై ప్రెషర్ పెంచుతుంది..
 

మిడిల్ ఓవర్లలో విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ చేసే పరుగులు.. భారత జట్టు చేసే స్కోరుని డిసైడ్ చేస్తాయి.. లీగ్ స్టేజీలో ఆడినట్టే ఆడితే,  రవీంద్ర జడేజా డెత్ ఓవర్లలోనే బ్యాటింగ్‌కి వస్తాడు..
 

తొలుత బౌలింగ్ చేయాల్సి వస్తే జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ పవర్ ప్లేలో తీసే వికెట్లు, న్యూజిలాండ్ స్కోరుని డిసైడ్ చేస్తాయి. వీరిద్దరూ ఎంత త్వరగా న్యూజిలాండ్ ఓపెనర్లను అవుట్ చేయగలిగితే, న్యూజిలాండ్‌ని అంత తక్కువ స్కోరుకి కట్టడి చేయొచ్చు.
 

మిడిల్ ఓవర్లలో మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా.. పరుగులను కట్టడి చేయగలుగుతారు. లక్ష్యఛేదనలో విరాట్ కోహ్లీ కీలకంగా మారతాడు. టార్గెట్ ఎంతైనా దాన్ని ఛేదించడానికి సుదీర్ఘమైన ఇన్నింగ్స్ నిర్మించగల విరాట్ కోహ్లీ లాంటి కీ ప్లేయర్ అవుతాడు..

click me!