ధోనీ రిటైర్ అయితే సీఎస్‌కే కెప్టెన్‌‌గా కేన్ విలియంసన్‌‌... ప్రజ్ఞాన్ ఓజా షాకింగ్ కామెంట్...

First Published Apr 29, 2021, 9:40 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి, టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది చెన్నై సూపర్ కింగ్స్. గత ఏడాది దారుణమైన ప్రదర్శన తర్వాత సీఎస్‌కే కమ్‌బ్యాక్ ఇచ్చిన తీరు, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ధోనీ రిటైర్ అయితే పరిస్థితి ఏంటి?

గత ఏడాది ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభానికి ముందే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు అర్ధాంతరంగా ప్రకటించి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ... దీంతో ఐపీఎల్‌కి కూడా 2020లోనే వీడ్కోలు పలుకుతాడని వార్తలు వచ్చాయి.
undefined
అందుకే సీఎస్‌కే ఆడిన ప్రతీ మ్యాచ్‌లో ప్లేయర్లు, ధోనీ సంతకం చేసిన జెర్సీలను జ్ఞాపికగా తీసుకున్నారు కూడా. 2020 సీజన్‌లో ధోనీ ఆడిన ఆఖరి మ్యాచ్‌లో ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. ‘ఈ సీజన్ కచ్ఛితంగా తనకి ఆఖరి సీజన్ కాదు’ అంటూ చెప్పాడు.
undefined
చెప్పినట్టుగానే ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆడుతున్నా, ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు మహేంద్ర సింగ్ ధోనీ. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చేతుల్లోకి వచ్చిన ఈజీ క్యాచ్‌ను ధోనీ నేలవిరచడంతో మరోసారి మాహీ రిటైర్మెంట్ గురించి వార్తలు వస్తున్నాయి...
undefined
మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్ అయితే చెన్నై సూపర్ కింగ్స్‌ కొత్త కెప్టెన్‌గా ఎవరు ఉంటారనేదానిపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. కొందరు సురేశ్ రైనాకి సీఎస్‌కే కెప్టెన్సీ దక్కొచ్చని భావిస్తుంటే, మరికొందరు రవీంద్ర జడేజాకి కెప్టెన్సీ దక్కొచ్చని అంచనా వేస్తున్నారు.
undefined
‘రవీంద్ర జడేజా, వైస్ కెప్టెన్‌గా పనికొస్తాడు. జట్టుకి అవసరమైనప్పుడు అమూల్యమైన సలహాలతో కెప్టెన్‌గా సాయపడగలడు. అయితే కెప్టెన్సీ గురించి మాట్లాడితే చెన్నై సూపర్ కింగ్స్ లాంటి జట్టును అతను నడిపించలేడు.
undefined
మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత సీఎస్‌కే, తనలా నడిపించగల ఒకే ఒక్క ప్లేయర్ కేన్ విలియంసన్. అతన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ సరిగ్గా వాడుకోవడం లేదు.
undefined
వచ్చే ఏడాది మెగా వేలం ఉంది. ఒకవేళ ధోనీ, వచ్చే సీజన్ ఆడకూడదని నిర్ణయించుకుంటే, ఎంత ఖరీదైనా మరో ఆలోచన లేకుండా కేన్ విలియంసన్‌ను కొనుగోలు చేసి, సీఎస్‌కేకి కెప్టెన్‌గా తీసుకురావాలి...’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రజ్ఞాన్ ఓజా...
undefined
అయితే ప్రజ్ఞాన్ ఓజా కామెంట్లపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఏది ఏమైనా కేన్ విలియంసన్‌ను వేరే జట్టుకు ఇచ్చేది లేదని కామెంట్లు చేస్తున్నారు.
undefined
2021 సీజన్ సమయంలో కేన్ విలియంసన్‌ను మెగా వేలంలో వదిలేస్తున్నారా? అంటూ డేవిడ్ వార్నర్‌ను ప్రశ్నించారు అభిమానులు. దానికి వార్నర్.. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ కేన్ విలియంసన్‌ను వదులుకోమని’ హామీ ఇచ్చాడు డేవిడ్ వార్నర్.
undefined
2021 మెగా వేలంలో ప్రతీ జట్టుకి ఇద్దరు విదేశీ ప్లేయర్లను, ముగ్గురు స్వదేశీ ప్లేయర్లను అట్టిపెట్టుకునేందుకు మాత్రమే వెసులుబాటు ఉంటుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌తో పాటు కేన్ విలియంసన్‌ను అట్టిపెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది.
undefined
click me!