ఆండ్రే రస్సెల్ మెరుపులు... ఢిల్లీ క్యాపిటల్స్ ముందు ఈజీ టార్గెట్...

First Published Apr 29, 2021, 9:20 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్ మరోసారి తడబడింది. అయితే ఆఖర్లో ఆండ్రే రస్సెల్ మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. ఒకానొక దశలో 120 పరుగులైనా దాటుతుందా? అనుకున్నా... రస్సెల్ మెరుపులతో ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది కేకేఆర్.

టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి శుభారంభం దక్కలేదు. 12 బంతుల్లో ఓ ఫోర్, సిక్సర్‌తో 15 పరుగులు చేసిన నితీశ్ రాణా, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు.
undefined
ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి 17 బంతుల్లో 2 ఫోర్లతో 19 పరుగులు చేసి స్టోయినిస్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 69 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్.
undefined
గత మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడిన కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 2 బంతులాడి పరుగులేమీ చేయకుండానే లలిత్ యాదవ్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కి అవుట్ అయ్యాడు.
undefined
ఆ తర్వాత రెండో బంతికే సునీల్ నరైన్‌ను కూడా డకౌట్ చేశాడు లలిత్ యాదవ్. 38 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 43 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.
undefined
10 బంతుల్లో ఓ ఫోర్, సిక్సర్‌తో 14 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ కాగా ఆండ్రే రస్సెల్, ప్యాట్ కమ్మిన్స్ కలిసి మంచి భాగస్వామ్యంతో కేకేఆర్‌ను ఆదుకున్నారు.
undefined
ఆండ్రే రస్సెల్ 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 45 పరుగులు చేయగా, ప్యాట్ కమ్మిన్స్ 13 బంతుల్లో ఓ ఫోర్‌తో 11 పరుగులు చేసి అజేయంగా నిలిచారు...కేకేఆర్‌కి ఆఖరి 3 ఓవర్లలో 43 పరుగులు రావడం విశేషం.
undefined
click me!