వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో జడేజాకి చోటు ఇవ్వడంపై అతను ముందుగానే ఆశ్చర్యం వ్యక్తం చేశాడు... ఫైనల్ ఆడేందుకు జడేజా కంటే హనుమ విహారి బెటర్ ప్లేయర్ అంటూ కామెంట్ చేశాడు...
సంజయ్ మంజ్రేకర్ ఊహించినట్టుగానే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో జడ్డూ పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో ఘోరంగా ఫెయిల్ అయిన జడ్డూ, ఫీల్డింగ్‌లోనూ పెద్దగా చేసిందేమీ లేదు...
తొలి ఇన్నింగ్స్‌లో 15 పరుగులు చేసిన రవీంద్ర జడేజా, రెండో ఇన్నింగ్స్‌లో 16 పరుగులు చేశాడు. అయితే జడ్డూ నుంచి ఆశించిన పర్ఫామెన్స్ మాత్రం ఇది కాదు...
గత మూడేళ్లుగా భారత జట్టులో కీలక సభ్యుడిగా మారిన రవీంద్ర జడేజా, బ్యాటింగ్‌లో 50 కంటే అధిక సగటుతో పరుగులు చేస్తూ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కంటే ముందున్నాడు.
‘ఫైనల్‌కి ముందు ఇద్దరు స్పిన్నర్లను ఎంపిక చేయడంపై చాలా చర్చ జరిగింది. వర్షం కారణంగా టాస్ ఒక రోజు ఆలస్యం అయిన తర్వాతైనా జడ్డూని పక్కనబెట్టి మరో పేసర్‌ని ఆడించాల్సింది...
కానీ జడేజాని ఆడించేందుకే టీమిండియా ఇంట్రెస్ట్ చూపించింది. జడేజా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అనే కారణంగా అతనికి ఫైనల్‌లో చోటు ఇవ్వలేదు. లోయర్ ఆర్డర్‌లో వేగంగా పరుగులు చేసే ప్లేయర్ కావాలనే ఉద్దేశంతో జడ్డూకి ప్లేస్ ఇచ్చారు.
అయితే జడేజా బ్యాటింగ్‌లో చేసిందేమీ లేదు. పిచ్ స్పిన్‌కి అనుకూలిస్తున్నప్పుడు, పొడిగా ఉన్నప్పుడు అశ్విన్‌తో పాటు జడేజాని ఎంపిక చేసి ఉంటే దానికో అర్థం ఉండేది. కానీ వర్షం పడుతున్నప్పుడు జడేజాని కేవలం బ్యాటింగ్ కోసమే తీసుకున్నారు.
బ్యాటింగ్ కోసమే తీసుకోవాలని టీమ్ భావించి ఉంటే స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ రూపంలో హనుమ విహారి లాంటి ప్లేయర్ అందుబాటులో ఉన్నాడు. అతనికి కౌంటీలు ఆడిన అనుభవం కూడా ఉంది.
విహారికి తుదిజట్టులో చోటు దక్కి ఉంటే రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు స్కోరు 220 నుంచి 230 వరకూ ఈజీగా వెళ్లేంది...
ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో టీమిండియా ఈ తప్పు మళ్లీ చేయదని అనుకుంటున్నా... ’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్...