తుది జట్టు నుంచి రవీంద్ర జడేజా అవుట్... నలుగురు పేసర్లు, ఒకే స్పిన్నర్‌తో టీమిండియా...

First Published Jun 17, 2021, 4:18 PM IST

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో సౌంతిప్టన్‌లోని రోజ్ బౌల్ వేదికగా ఇండియా, న్యూజిలాండ్ మధ్య మొట్టమొదటి ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కి ముందు భారత జట్టు అభిమానులను కలిచివేస్తున్న ప్రశ్న టీమ్‌లో ఎవరెవరు ఉంటారు?

ఓపెనర్లుగా శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ ఉండడం ఖాయం. ఆ ఇద్దరూ తప్ప మరో ఆప్షన్ లేకుండా తుది 15 మంది జట్టులో నుంచి కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌లను తప్పించింది టీమిండియా...
undefined
వన్‌డౌన్‌లో ఛతేశ్వర్ పూజారా, టూ డౌన్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆ తర్వాత వైస్ కెప్టెన్ అజింకా రహానే లేదా వికెట్ కీపర్ రిషబ్ పంత్ క్రీజులోకి రావడం గ్యారెంటీ...
undefined
అయితే ఆ తర్వాత అసలు పోటీ మొదలవుతోంది. ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడిన టెస్టు స్పెషలిస్టు ప్లేయర్ హనుమ విహారికి తుదిజట్టులో చోటు కల్పించాలా? లేక ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకి ఛాన్స్ ఇవ్వాలా? అనే విషయంలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.
undefined
అటు బ్యాటుతోనూ, ఇటు బాల్‌తోనూ.. అదిరిపోయే ఫీల్డింగ్ విన్యాసాలతోనూ జట్టుకు అదనపు బలాన్ని తీసుకొచ్చే రవీంద్ర జడేజా తుది జట్టులో ఉండాల్సిందేనని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం అతనికి బదులు విహారిని ఆడించడం బెటర్ అని అంటున్నారు... దీంతో విహారి, జడేజాలలో ఎవరికి తుది జట్టులో చోటు దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది...
undefined
ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ సీనియర్ స్పిన్నర్‌గా, ఆల్‌రౌండర్‌గా తుదిజట్టులో చోటు దక్కించుకోవడం ఖాయం. ఇక మిగిలింది పేస్ బౌలింగ్ విభాగం... ఇందులోనూ ఇద్దరి మధ్య పోటీ ఏర్పడింది...
undefined
100 టెస్టులు ఆడిన అనుభవం ఉన్న ఇషాంత్ శర్మ, గత ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టుల్లో ఆరంగ్రేటం చేసిన మహ్మద్ సిరాజ్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. వాస్తవానికి కొన్నిరోజుల ముందు దాకా అయితే సిరాజ్‌ను పక్కనబెట్టి ఇషాంత్ శర్మను ఆడిస్తారని చెప్పేవారు ఎవ్వరైనా...
undefined
అయితే ఇంగ్లాండ్ టూర్‌కి ముందు మీడియా సమావేశంలో సిరాజ్‌ను ఓపెనింగ్ స్పెల్ వేయించాలని విరాట్ కోహ్లీ, రవిశాస్త్రితో చెబుతున్న ఆడియో లీక్ అయ్యింది. దీంతో మహ్మద్ సిరాజ్, ఫైనల్ మ్యాచ్‌లో ఉంటాడని భావిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు.
undefined
అయితే 100 టెస్టులకు పైగా అనుభవం ఉన్న ఇషాంత్ శర్మను తప్పించి, ఇంగ్లాండ్ పిచ్‌లపై ఏ మాత్రం అనుభవం లేని మహ్మద్ సిరాజ్‌ను ఆడించడం... 2019 వన్డే వరల్డ్‌కప్‌లో అంబటి రాయుడికి బదులుగా విజయ్ శంకర్‌ను ఆడించినట్టే సరిదిద్దుకోలేని పొరపాటుగా మారుతుందని అంటుననారు మరికొందరు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్.
undefined
ఒకవేళ ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్ ఇద్దరినీ ఆడించాలని టీమిండియా భావిస్తే మాత్రం హనుమ విహారి, రవీంద్ర జడేజా తమ స్థానాలను త్యాగం చేయాల్సిందే. అయితే నలుగురు పేసర్లతో బరిలో దిగాలని టీమిండియా భావించకపోవచ్చని అంచనా...
undefined
ఇంగ్లాండ్‌లో వాతావరణం చాలా వేగంగా మారుతూ ఉంటుంది. కాబట్టి పిచ్ కండీషన్‌ను బట్టి సిరాజ్, ఇషాంత్, షమీ, బుమ్రాలతో పాటు అశ్విన్‌ను ఆడించి, జడేజాను పక్కనబెట్టాలని టీమిండియా భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి...
undefined
లోయల్ ఆర్డర్‌లో కీలకమైన భాగస్వామ్యాలు నెలకొల్పుతూ, జట్టును ఆదుకునే రవీంద్ర జడేజా లేకపోతే భారత జట్టుకి కష్టాలు తప్పవు. ఫీల్డింగ్‌లో జడ్డూ చేసే రనౌట్‌లు, కీలక భాగస్వామ్యాలను విడదీసే స్పిన్ మ్యాజిక్ జట్టుకి దూరమైనట్టే...
undefined
click me!