గౌతమ్ గంభీర్ కూడా చెప్పేశాడు, ఇక మ్యాచ్ రిజల్ట్‌ తెలిసిపోయినట్టే... ఫైనల్‌లో గెలిచేది ఎవరంటే...

First Published Jun 17, 2021, 3:40 PM IST

క్రికెట్‌లో సెంటిమెంట్స్ చాలా ఎక్కువే. ముఖ్యంగా కొందరు ఏది గెలుస్తుందని చెబితే అదే టీమ్ విజయం సాధించబోతుందని నమ్ముతారు క్రికెట్ ఫ్యాన్స్. గౌతమ్ గంభీర్ విషయంలో సీన్ రివర్స్. గంభీర్ ఏ టీమ్ గెలుస్తుందని కామెంట్ చేస్తే, అది కచ్ఛితంగా ఓడిపోవడం ఖాయమని ఫిక్స్ అయిపోతారు ఫ్యాన్స్...

గత ఏడాది ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆరంభ మ్యాచుల నుంచి గౌతమ్ గంభీర్ టంగ్ పవర్ గురించి క్రికెట్ ఫ్యాన్స్‌కి బాగా తెలిసి వచ్చింది. మ్యాచ్‌ ఆరంభానికి ముందు గంభీర్ ఫలానా టీమ్ గెలుస్తుందని ప్రిడిక్ట్ చేయడం, ఫలానా క్రికెటర్ బాగా ఆడతాడని అంచనా వేయడం... మ్యాచ్‌లో వాళ్లు ఘోరంగా ఫెయిల్ అవ్వడం ఆనవాయితీగా వస్తోంది...
undefined
ఐపీఎల్ తర్వాత జరిగిన ఆస్ట్రేలియా టూర్‌లోనూ, ఆ తర్వాత జరిగిన ఇంగ్లాండ్ సిరీస్‌లోనూ ఇదే జరిగింది. స్మిత్ కొట్టడు అని కామెంట్ చేస్తే, ఆ మ్యాచ్‌లో అతను సెంచరీ సాధించడం... కొడతాడు అన్న మ్యాచుల్లో డకౌట్ అవ్వడం జరిగాయి. రోహిత్ శర్మ, జో రూట్, విరాట్ కోహ్లీ కూడా ఇలా గంభీర్ నాలుక పవర్‌కి బలైనవాళ్లేనని క్రికెట్ ఫ్యాన్స్ ఉద్దేశం...
undefined
తాజాగా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో గెలవబోయే టీమ్ గురించి కూడా కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్. అయితే గత అనుభవాల దృష్ట్యా ఎంతో జాగ్రత్తగా ఫలానా టీమ్ గెలుస్తుందని చెప్పకుండా విశ్లేషించాడు గౌతీ...
undefined
‘టెస్టు మ్యాచుల ఫలితాలన్నీ బౌలర్ల చేతుల్లోనే ఆధారపడి ఉంటాయి. టెస్టు మ్యాచ్ గెలవాలంటే కచ్ఛితంగా 20 వికెట్లు పడగొట్టగల సామర్థ్యం ఉన్న బౌలర్లు జట్టులో ఉండాలి...
undefined
అలాంటి సామర్థ్యం భారత బౌలింగ్ యూనిట్‌లో ఉంది. ప్రస్తుత భారత బౌలింగ్ లైనప్ ప్రపంచంలో ఎలాంటి జట్టునైనా ఇబ్బంది పెట్టగలదు. టీమిండియా బౌలింగ్ అటాక్‌ను అంచనా వేయడం అసాధ్యం...
undefined
అయితే ఫైనల్‌లో ఎవరు ఫెవరెట్‌ అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే న్యూజిలాండ్‌ ఇప్పటికే ఇంగ్లాండ్‌లో రెండు టెస్టులు ఆడింది. వారికి ఇప్పటికే అక్కడి పిచ్, వాతావరణంపై క్లారిటీ వచ్చేసి ఉంటుంది...
undefined
అన్నింటికీ మించి వాళ్లు ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌నే ఓడించారు... మనం ఇంట్రా స్వార్డ్ మ్యాచులు ఆడినా అది మ్యాచ్ ప్రాక్టీస్‌గా ఉండదు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌కి న్యూజిలాండ్‌ బాగా ప్రిపేర్ అయ్యింది...
undefined
భారత్, న్యూజిలాండ్ రెండు జట్లు కూడా డ్రా కోసం ప్రయత్నించవు. ఫైనల్ గెలవాలనే కోరుకుంటాయి... కాబట్టి మ్యాచ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.
undefined
భారత జట్టుకి పటిష్టమైన బౌలింగ్ లైనప్ ఉందని చెప్పడం వల్ల టీమిండియా గెలుస్తుందని గంభీర్ చెబుతారేమోనని కొందరు అభిమానులు భయపడినా, ఆ వెంటనే న్యూజిలాండ్‌కి అడ్వాంటేజ్ ఉందని చెప్పడంతో సంతోషిస్తున్నారు...
undefined
గౌతమ్ గంభీర్ చెప్పినట్టు భారత జట్టులో ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్‌ల రూపంలో మంచి పటిష్టమైన బౌలింగ్ అటాక్ ఉంది. అయితే వీరిలో బుమ్రా, షమీ తుదిజట్టులో ఉండడం ఖాయం కాగా, మరో పేసర్‌గా సిరాజ్‌ను ఆడిస్తారా? లేక ఇషాంత్ శర్మను ఆడిస్తారా? అనేది తేలాల్సి ఉంది...
undefined
ఒకవేళ నలుగురు పేసర్లతో బరిలో దిగాలని టీమిండియా భావిస్తే... రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలలో ఒకరిని పక్కనబెట్టాల్సి ఉంటుంది. స్పిన్ ఆల్‌రౌండర్లైన ఈ ఇద్దరూ జట్టులో ఉండడం తప్పనిసరి...
undefined
అయితే ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లను ఆడించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తే, కౌంటీలు ఆడిన అనుభవం సంపాదించిన క్రికెటర్ హనుమ విహారిని పక్కనబెట్టాల్సి ఉంటుంది... మొత్తానికి ఫైనల్ ఆడే తుదిజట్టు కూర్పుపై అనేక అనుమానాలు రేగుతున్నాయి.
undefined
న్యూజిలాండ్ మాత్రం ఐదుగురు పేసర్లతో లేదా నలుగురు పేసర్లు, ఓ స్పిన్నర్‌గా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడాలని భావిస్తోంది. న్యూజిలాండ్ జట్టులో ట్రెంట్ బౌల్ట్, వాగ్నర్, టిమ్ సౌథీ, జెమ్మీసన్ వంటి స్టార్ పేసర్లు ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.
undefined
click me!