రాహుల్ ద్రావిడ్ జెర్సీ నెంబర్ వెనకాల అంత పెద్ద కథ ఉందా... పెళ్లైన తర్వాత భార్య...

First Published Jun 17, 2021, 3:06 PM IST

క్రికెటర్లకి సెంటిమెంట్లు ఉన్నట్టే, వారి జెర్సీ నెంబర్ల వెనకాల కూడా ఏదో ఒక రీజన్ ఉంటుంది. రోహిత్ శర్మ, అమ్మ చెప్పిందని 45 నెంబర్ జెర్సీ ధరిస్తే, విరాట్ కోహ్లీ వాళ్ల నాన్న చనిపోయిన తేదీని జెర్సీ నెంబర్‌గా మార్చుకున్నాడు. అయితే రాహుల్ ద్రావిడ్ జెర్సీ నెంబర్ వెనకాల చాలా పెద్ద కథే ఉందట...

టీమిండియాలోకి వచ్చిన కొత్తలో రాహుల్ ద్రావిడ్ నెం.5 జెర్సీని ధరించేవాడు. సింగిల్ డిజిట్ జెర్సీ ధరించాలని అనుకున్న రాహుల్ ద్రావిడ్, తనకి నచ్చిన ఐదు నెంబర్‌ని జెర్సీగా వాడేవాడు...
undefined
అయితే 2003, మే 4న తన చిన్ననాటి స్నేహితురాలు, ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన విజేత పెందార్కర్‌ను వివాహం చేసుకున్నాడు రాహుల్ ద్రావిడ్... తన కూల్ అండ్ కామ్ యాటిట్యూడ్‌తో ద్రావిడ్ ఎంతో సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న ద్రావిడ్‌కి మతిమరుపు చాలా ఎక్కువట...
undefined
క్రికెట్ గురించిన విషయాలను ప్రతీదీ క్షుణ్ణంగా గుర్తు పెట్టుకునే రాహుల్ ద్రావిడ్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను మాత్రం అస్సలు గుర్తుపెట్టుకునేవాడు కాదట. అలాగే పెళ్లైన తర్వాత విజేత పెందార్కర్ పుట్టినరోజును కూడా మరిచిపోయాడు ద్రావిడ్.
undefined
పెళ్లైన తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజును కూడా మరిచిపోవడంతో ఆ రోజు ఇంట్లో చాలా పెద్ద గొడవే జరిగింది... ఆ గొడవ కారణంగా తన భార్య విజేత పుట్టినరోజును గుర్తుపెట్టుకునేందుకు వీలుగా ఆమె బర్త్ డేట్ అయిన 24ని జెర్సీగా ధరించాడు రాహుల్ ద్రావిడ్...
undefined
2004 పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తొలిసారి జెర్సీ నెంబర్ 24తో బరిలో దిగాడు. అయితే భార్య బర్త్ డేట్‌ 24 నెంబర్‌ జెర్సీతో రాహుల్ ద్రావిడ్ పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు... దీంతో జ్యోతిష్యాన్ని నమ్మే ద్రావిడ్, పరిష్కారం కోసం వెతికాడు...
undefined
అలా ప్రముఖ జ్యోతిషుడు సంజయ్ బి జుమానీ, రాహుల్ ద్రావిడ్‌కి 24 నుంచి 19 నెంబర్‌కి మారాలని సలహా ఇచ్చాడు. ‘న్యూమరాలజీ ప్రకారం రాహుల్ ద్రావిడ్ నెం.2 పర్సన్. అతని గురువు చంద్రుడు. అతనికి నెం.1 లాంటి బలమైన సంఖ్య తోడుగా ఉండాలి. 19లో 1,9 కలిపినా 10, అంటే 1 వస్తుంది...’ అని చెప్పాడట సంజయ్ బి జుమానీ...
undefined
సంజయ్ చెప్పినట్టుగానే తన జెర్సీ నెంబర్‌ని 19కి మార్చాడు రాహుల్ ద్రావిడ్. అలా 19 నెంబర్‌తో ఆడిన మొట్టమొదటి మ్యాచ్‌లోనే రాహుల్ ద్రావిడ్ 99 పరుగులు చేశాడు...
undefined
ఆ ఇన్నింగ్స్‌తో నెంబర్ 19 జెర్సీ తనకి కలిసి వస్తోందని విశ్వసించిన రాహుల్ ద్రావిడ్, కెరీర్ ఆసాంతం ఆ సంఖ్యనే కొనసాగించాడు... 164 టెస్టులు ఆడిన రాహుల్ ద్రావిడ్, 13,288 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్లలో ఒకడిగా నిలిచాడు.
undefined
344 వన్డేల్లో 10,889 పరుగులు చేసిన రాహుల్ ద్రావిడ్, వన్డేలు, టెస్టుల్లో 10 వేలకు పైగా పరుగులు చేసిన అతికొద్ది మంది ప్లేయర్లలో ఒకడిగా నిలిచాడు. యాదృచ్ఛికంగా క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత అండర్ 19 టీమ్‌కి కోచ్‌గా వ్యవహారించి, అక్కడ కూడా సక్సెస్ సాధించాడు రాహుద్ ద్రావిడ్.
undefined
click me!