నాలుగో రోజు వర్షార్పణం... ఇక ఫలితం తేలడం కష్టమే... ఫైనల్‌లో తగ్గని వరుణ ప్రతాపం...

First Published Jun 21, 2021, 7:39 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌పై వరుణుడి ప్రతాపం తగ్గడం లేదు. ఇప్పటికే వర్షం కారణంగా రోజున్నరకు పైగా ఆట రద్దు కాగా, సోమవారం ఎడతెడపి లేకుండా కురిసిన భారీ వర్షం కారణంగా ఒక్క బంతి వేయడానికి కూడా వీలుకాలేదు..

ఉదయం నుంచి వర్షం కురుస్తూ ఉండడంతో మధ్యాహ్నం 3 గంటల వరకూ ఎదురుచూసిన అంపైర్లు, ఆట సాధ్యం కాదని తేల్చేశారు. వర్షం ఆగినా మైదానమంతా నీళ్లతో నిండిపోవడంతో దాన్ని ఆటకు సిద్ధం చేయడానికి చాలా సమయం పడుతుందని తేలడంతో నాలుగోరోజును రద్దు చేశారు...
undefined
ఇప్పటికే తొలి రోజు మొత్తం వర్షం కారణంగా రద్దు కాగా, రెండో రోజు మూడో సెషన్‌ వెలుతురు సరిగా లేక రద్దయ్యింది. ఇప్పుడు నాలుగో రోజు కూడా ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దు కావడంతో రిజర్వు డేతో కలుపుకుని, ఇంకా రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది.
undefined
సౌంతిప్టన్‌లో రేపు వాతావరణం ఆటకు అనుకూలించే అవకాశం ఉందని తేల్చిన వాతావరణ శాఖ, వర్షం కురిసే ఛాన్స్ తేలని ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ తెలిపింది...
undefined
రేపు, ఎల్లుండి మొత్తం ఆట సాగినా మ్యాచ్ ఫలితం రావడం చాలా కష్టమే. ఎందుకంటే రెండు రోజుల్లో కలిసి మహా అయితే 106 ఓవర్ల ఆట మాత్రమే వీలు అవుతుంది...
undefined
నిన్న ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది న్యూజిలాండ్. టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకి కివీస్ ఇంకా 116 పరుగుల దూరంలో ఉంది...
undefined
న్యూజిలాండ్‌‌ను తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ చేయాలన్నా ఇంకా 8 వికెట్లు తీయాల్సి ఉంటుంది. ఆ తర్వాత టీమిండియా బ్యాటింగ్ చేసి, కివీస్‌ను టార్గెట్‌ను ఫిక్స్ చేయాల్సి ఉంటుంది...
undefined
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో న్యూజిలాండ్‌ను ఆలౌట్ చేసి, భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌ను ముగించడమే చాలా కష్టమవుతుంది. దీంతో ఫైనల్ మ్యాచ్ దాదాపు డ్రాగా ముగిసినట్టే.
undefined
ఏదో అద్భుతం లేదా సంచలన ప్రదర్శన జరిగితే తప్ప ఫైనల్ మ్యాచ్‌లో ఫలితం తేలడం అసాధ్యమే అవుతుంది... ఫైనల్ మ్యాచ్‌ను ఫలితం తేలేవరకూ మూడు రోజులను రిజర్వు డేలుగా కేటాయించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
undefined
అయితే ఐసీసీ నిర్వహిస్తున్న మొట్టమొదటి టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కావడంతో ఈ సారి ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. వచ్చే సీజన్‌లో పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసే అవకాశం ఉంది.
undefined
click me!