రెండేళ్ల కష్టాన్ని వృథా చేసేశారు, ఇలాంటి టైమ్‌లో ఫైనల్ పెడతారా... ఐసీసీపై వీవీఎస్ లక్ష్మణ్ ఫైర్...

First Published Jun 21, 2021, 6:22 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలిగిస్తూనే ఉంది. వర్షం కారణంగా జూన్ 18న ఆట తొలి రోజు టాస్ కూడా వేయకుండానే రద్దు కాగా, ఆ తర్వాత కూడా పలుమార్లు వాతావరణం సరిగా లేని కారణంగా అవాంతరాలు కలిగాయి...

ఇంగ్లాండ్‌లోని సౌంతిప్టన్‌లో గల ఏంజెల్ బౌల్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలి రోజు పూర్తిగా రద్దు కాగా, రెండో రోజు వాతావరణం సహకరించకపోవడంతో 64 ఓవర్ల ఆటే సాధ్యమైంది...
undefined
మూడో రోజు వాతావరణం కాస్త సహకరించడంతో 80 ఓవర్ల దాకా ఆట సాధ్యమైంది. నాలుగో రోజు కూడా సౌంతిప్టన్‌లో భారీ వర్షం కురవడంతో మొదటి సెషన్‌లో ఒక్క బంతి వేయడానికి కూడా వీలుకాలేదు...
undefined
‘ఈ ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి ఈ మ్యాచ్ సాగుతున్న విధానం తీవ్ర నిరుత్సాహానికి గురిచేస్తోంది...
undefined
ఫైనల్ మ్యాచ్ నిర్వహణపై ఐసీసీ రూల్స్ సరిగ్గా పెట్టలేదనిపిస్తుంది. రెండేళ్ల పాటు సాగిన సుదీర్ఘ టోర్నీ కాబట్టి ఫ్యాన్స్ అందరూ ఓ ఛాంపియన్‌ని చూడాలని అనుకుంటున్నారు... అయితే వర్షం కారణంగా ఇప్పుడు రిజల్ట్ వచ్చేందుకు కావాల్సినంత సమయం లేదు...
undefined
ఫైనల్ మ్యాచ్‌లో కచ్ఛితంగా రోజుకి 90 ఓవర్ల చొప్పున 5 రోజుల పాటు 450 ఓవర్ల పాటు టెస్టు సాగితే బాగుంటుంది... ఐసీసీ ఇలాంటి ఏర్పాట్లు చేస్తుందని భావించా...
undefined
ఇలాంటి పరిస్థితుల్లో ఫైనల్ మ్యాచ్‌కి కనీసం మూడు రోజులు రిజర్వు డేలుగా ఉంటే మంచిది. ఇలాగే వర్షం కొనసాగితే రిజర్వు డే మొత్తం ఆడినా ఫలితం తేలుతుందని అనుకోవడం లేదు...’ అంటూ కామెంట్ చేశాడు వీవీఎస్ లక్ష్మణ్.
undefined
‘ఇరుజట్లు కూడా విజయం కోసమే ఆడతాయి. పిచ్ బౌలర్లకు చక్కగా సహకరిస్తోంది. సరిగ్గా మూడునాలుగు రోజుల పాటు ఆట సాగితే ఫలితం రావచ్చు...
undefined
అయితే వాతావరణం ఇలాగే కొనసాగుతూ పోతే న్యూజిలాండ్‌కి అడ్వాంటేజ్ ఉంటుంది. మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ భారీ స్కోరు చేస్తే, టీమిండియాకి కష్టమవుతుంది...
undefined
ఫైనల్ మ్యాచ్ నిర్వహణను 450 ఓవర్లు పాటు, లేదా ఫలితం వచ్చేవరకూ కొనసాగించేందుకు ఐసీసీ ఏర్పాట్లు చేసి ఉంటే బాగుండేది...’ అంటూ కామెంట్ చేశాడు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ షేన్ బాండ్.
undefined
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 160 పరుగుల టార్గెట్‌ ఇచ్చినా, ఈ పిచ్ మీద దాన్ని సాధించడం కష్టమే అవుతుంది. చివరి రెండు రోజులు ఇరు జట్లు విజయం కోసం బాగా కష్టపడతాయి...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్.
undefined
click me!