ఐసీసీ వరల్డ్‌కప్ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో మన స్థానం ఎక్కడ... ఇలా అయితే ఆ రెండు జట్లకి కష్టమే...

First Published May 29, 2021, 10:57 AM IST

వన్డే వరల్డ్‌కప్ 2023 కోసం సూపర్ లీగ్ పాయింట్ల పట్టికను అమలులోకి తీసుకొచ్చింది ఐసీసీ. ఐసీసీలో శాశ్వత సభ్యులుగా ఉన్న 12 దేశాలతో పాటు ఈ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో పాల్గొనడానికి అర్హత సాధించిన నెదర్లాండ్స్ కూడా ఇందులో పోటీపడబోతున్నాయి. 

2023లో జరిగే వన్డే వరల్డ్‌కప్ ఆరంభ సమయానికి ఈ పాయింట్ల పట్టికలో తొలి 10 స్థానాల్లో ఉన్న జట్లకి మాత్రమే మెగా టోర్నీలో పాల్గొనే అవకాశం దక్కుతుంది. చివర మూడు జట్లు ఎలిమినేట్ అయిపోయినట్టే...
undefined
2020-21లో ఇప్పటికే 9 వన్డేలు ఆడి, ఐదింట్లో విజయం సాధించిన బంగ్లాదేశ్, ఈ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండడం విశేషం. 50 పాయింటల సాధించిన బంగ్లాదేశ్, రెండు సిరీస్ విజయాలు అందుకుంది.
undefined
ఇంగ్లాండ్ 9 మ్యాచులు ఆడి కేవలం 4 విజయాలు మాత్రమే సాధించింది. 40 పాయింట్ల సాధించిన ఇంగ్లాండ్, ఓ సిరీస్ విజయంత రెండో స్థానంలో ఉంది.
undefined
2020-21లో 6 మ్యాచులు ఆడిన పాకిస్తాన్, నాలుగింట్లో విజయాలు సాధించి... సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. పాక్ రెండు సిరీస్ విజయాలు అందుకోవడం విశేషం.
undefined
ఆస్ట్రేలియా కూడా ఈ ఏడాది ఆరు మ్యాచులు ఆడి 4 విజయాలు అందుకుంది. ఆసీస్ కూడా 2 సిరీస్ విజయాలు అందుకుని, పాకిస్తాన్‌తో సమానమైన పాయింట్లు సంపాదించింది.
undefined
న్యూజిలాండ్... ఈ ఏడాది మూడు మ్యాచులు ఆడి మూడు వన్డేల్లోనూ విజయం సాధించింది న్యూజిలాండ్. అయితే ఆడిన మ్యాచులు తక్కువ కావడంతో 30 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది న్యూజిలాండ్.
undefined
ఆఫ్ఘనిస్తాన్... పసికూన జట్టుగా ఎంట్రీ ఇచ్చిన ఆఫ్ఘాన్ కూడా సూపర్ లీగ్‌లో మంచి పర్ఫామెన్స్ ఇస్తోంది. 3 మ్యాచులు ఆడి మూడింట్లోనూ విజయాలు అందుకుని ఆరో స్థానంలో ఉంది.
undefined
వెస్టిండీస్... ఈ ఏడాది ఆరు మ్యాచులు ఆడిన వెస్టిండీస్, మూడింట్లో ఓడి, మూడింట్లో విజయాలు అందుకుంది. దీంతో విండీస్ జట్టు ఖాతాలో 30 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది.
undefined
టీమిండియా... ఆస్ట్రేలియాలో రెండు వన్డేలు ఓడి, ఓ వన్డే గెలిచిన టీమిండియా... ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో రెండు వన్డేలు గెలిచి, ఓ వన్డే ఓడింది. దీంతో ఆరు మ్యాచుల్లో మూడు విజయాలతో 8వ స్థానంలో ఉంది టీమిండియా. అయితే 2023 వన్డే వరల్డ్‌కప్‌కి ఆతిథ్యం ఇస్తుండడంతో హోస్ట్ కంట్రీగా టీమిండియా ఇప్పటికే ఈ మెగా టోర్నీకి అర్హత సాధించింది.
undefined
జింబాబ్వే 3 మ్యాచుల్లో ఒకే విజయంతో 9వ స్థానంలో, ఐర్లాండ్‌లో ఆరు మ్యాచుల్లో ఒకే విజయంతో 10వ స్థానంలో ఉన్నాయి.
undefined
ఒకప్పుడు టాప్‌ టీమ్‌గా వెలుగొందిన సౌతాఫ్రికా మూడింట్లో ఒకే విజయం అందుకుని 11వ స్థానంలో ఉంది. సఫారీ జట్టు ఆటతీరు మారకపోతే, టోర్నీకి అర్హత సాధించకుండానే వెనుదిరిగే ప్రమాదం ఉంది.
undefined
ఎట్టకేలకు బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో విజయం సాధించిన శ్రీలంక, సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. 6 మ్యాచుల్లో ఒకే విజయం సాధించిన శ్రీలంక, 12వ స్థానంలో ఉంది. వన్డే వరల్డ్‌కప్‌కి అర్హత సాధించాలంటే శ్రీలంక కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ చూపించాల్సి ఉంటుంది.
undefined
నెదర్లాండ్స్... ఇప్పటిదాకా నెదర్లాండ్ ఒక్క అంతర్జాతీయ వన్డే కూడా ఆడలేదు. దీంతో వీరి అవకాశాలు కూడా సంక్లిష్టం కానున్నాయి. కేవలం 10 జట్లను మాత్రమే వన్డే వరల్డ్‌కప్ ఆడించాలని ఐసీసీ తీసుకున్న నిర్ణయం సరికాదని నెదర్లాండ్ క్రికెటర్ మ్యాక్స్‌వెల్ అభిప్రాయపడ్డాడు.
undefined
click me!