తెలుగులో ట్వీట్లు చేస్తున్న డేవిడ్ వార్నర్... సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి వీడ్కోలు పలకనున్నాడా?

First Published May 29, 2021, 10:23 AM IST

మిగిలిన క్రికెటర్లతో పోలిస్తే తెలుగువారికి బాగా దగ్గరైన ఫారిన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్. ‘కేన్ మామ’ అంటూ విలియంసన్‌ను ఎంత ప్రేమగా పిలిచినా, వార్నర్ భాయ్‌తో ఓ ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. అయితే వార్నర్ వేస్తున్న ట్వీట్లు చూస్తుంటే, తెలుగు ఫ్యాన్స్‌లో ఒకింత భయం, ఆందోళన మొదలవుతున్నాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఐదు సీజన్లుగా కెప్టెన్‌గా వ్యవహారిస్తున్నాడు డేవిడ్ వార్నర్. 2016లొ సరిగ్గా ఇదే రోజున మే 29న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి, టైటిల్ గెలిచింది సన్‌రైజర్స్ హైదరాబాద్.
undefined
ఆ తర్వాత 2018 సీజన్‌లో బ్యాన్ కారణంగా ఆరెంజ్ ఆర్మీకి దూరమైన 2020 నుంచి మళ్లీ కెప్టెన్సీ పగ్గాలు డేవిడ్ వార్నర్‌కే దక్కాయి.
undefined
తెలుగువారు చూపించే అభిమానానికి ఉబ్బితబ్బిబైన వార్నర్, ఆరెంజ్ ఆర్మీ అభిమానులకు దగ్గరయ్యేందుకు చేయాల్సిందంతా చేశాడు.‘బుట్టబొమ్మ’ సాంగ్‌కి స్టెప్పులు వేసి, ఆ పాట వందల మిలియన్ల వ్యూస్ రాబట్టడానికి కారణమైన డేవిడ్ వార్నర్, తెలుగు పాటలకు స్టెప్పులేస్తూ, తెలుగు హీరోల సినిమాల్లో సీన్స్‌ని, పాటలను రీఫేస్ యాప్‌తో ఎడిట్ చేస్తూ అలరించాడు.
undefined
అయితే 2021 సీజన్‌లో డేవిడ్ వార్నర్‌కి చేదు అనుభవం ఎదురైంది. ఫస్టాఫ్‌లో ఆడిన ఆరు మ్యాచుల్లో ఒకే విజయం సాధించిందనే వంకతో వార్నర్ భాయ్‌ని కెప్టెన్సీ నుంచి, ఆ తర్వాత జట్టు నుంచి తొలగించింది సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం.
undefined
ఇది జరిగిన తర్వాత డేవిడ్ వార్నర్‌ని తిరిగి జట్టులోకి తీసుకోవాలని ప్రేక్షకులు డిమాండ్ చేస్తూ... ‘నో వార్నర్ నో ఎస్‌ఆర్‌హెచ్’, ‘బ్రింగ్ బ్యాక్ వార్నర్’ వంటి హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ చేశారు.
undefined
తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ పోస్టు చేసిన వీడియోకి ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను కేన్ విలియంసన్’ అంటూ కామెంట్ చేసిన వార్నర్, తన భార్య ఫోటోకి కూడా ఇదే విధంగా తెలుగులో కాప్షన్ ఇచ్చాడు.
undefined
ఇప్పుడు డేవిడ్ వార్నర్ ఏకంగా అభిమానుల కోసం తెలుగులోనే ట్వీట్ చేశాడు. ‘నేను మిమల్ని ఎప్పటికీ ప్రేమిస్తాను అభిమానులారా. మీకు నా మీద ఉన్న ప్రేమకి, ఇంకా మీ సహకారానికి ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశాడు.
undefined
డేవిడ్ వార్నర్ తెలుగులో వేసిన ట్వీట్‌కి అభిమానులు సంతోషిస్తున్నా, ఈ టైమ్‌లో ఎందుకు ఇలా ట్వీట్ చేశాడు. ఫ్రాంఛైజీ మారబోతున్నాడా? అందుకే తెలుగు అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశాడా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
undefined
కెప్టెన్సీ నుంచి తొలగించి, ఆ తర్వాత జట్టులో నుంచి కూడా తప్పించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమన్యం, డేవిడ్ వార్నర్‌ను వేలానికి వదిలేస్తుందని, వచ్చే సీజన్‌లో అతన్ని ఆరెంజ్ ఆర్మీ జెర్సీలో చూడడం కష్టమేనంటూ కొందరు క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు.
undefined
ఇప్పుడు డేవిడ్ వార్నర్ ట్వీట్ చేస్తుంటే అది నిజమేనేమో అనిపిస్తోంది. అయితే అలా కాకూడదని, కేవలం తాను తెలుగు అభిమానుల కోసం తెలుగులో వేసిన ట్వీట్ మాత్రమే కావాలని ఆశిస్తున్నారు ఆరెంజ్ ఆర్మీ అభిమానులు.
undefined
click me!