మంచి టైమింగ్‌తో క్రికెట్ ఫ్యాన్స్ అందర్నీ ఆకట్టుకున్న యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం సమాయత్తమవుతున్నాడు.
మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ రూపంలో ఇద్దరు ఓపెనర్లు సిద్ధంగా ఉన్నా, ఫైనల్ మ్యాచ్‌లో ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేసే అవకాశం శుబ్‌మన్ గిల్‌కే దక్కొచ్చు.
బ్యాటింగ్‌తో పాటు ఆకట్టుకునే రూపం, స్టైలిష్ లుక్‌తో మెరిసిపోయే శుబ్‌మన్ గిల్, టీమిండియా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని చాలారోజులుగా వార్తలు వస్తున్నాయి.
సారా టెండూల్కర్ ఈ వార్తలకు మరింత ఊపు ఇచ్చేలా ప్రవర్తించింది కానీ, శుబ్‌మన్ గిల్‌తో రిలేషన్‌షిప్‌లో ఉందన్న వార్తలను మాత్రం ఎనాడూ ఖండించలేదు... దీంతో ఈ వార్తలు మరింతగా ఊపందుకున్నాయి.
ప్రస్తుతం ముంబైలో బీసీసీఐ ఏర్పాటుచేసిన బయో బబుల్‌లో క్వారంటైన్‌లో గడుపుతున్న శుబ్‌మన్ గిల్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో కాసేపు ముచ్చటించాడు. ఈ సందర్భంగా ‘ఆర్ యూ సింగిల్’ అనే ప్రశ్న ఎదురైంది.
దానికి శుబ్‌మన్ గిల్ ‘అవును... నేను సింగిల్‌నే. ఇప్పట్లో ఆ ఊబిలో నన్ను నేను ఇరికించే ఆలోచన కూడా లేదు...’ అంటూ రిప్లై ఇచ్చాడు శుబ్‌మన్ గిల్. పరోక్షంగా సారా టెండూల్కర్‌తో తనకి ఎలాంటి సంబంధం లేదని తేల్చేశాడు శుబ్‌మన్ గిల్.
వాస్తవానికి శుబ్‌మన్ గిల్ కంటే సారా టెండూల్కర్ వయసులో ఏడాది పెద్దది. అయితే సచిన్ టెండూల్కర్, తనకంటే వయసులో ఆరేళ్లు పెద్దదైన అంజలిని ప్రేమించి, పెళ్లాడడంతో సారా, శుబ్‌మన్‌కి వయసు పెద్ద అడ్డంకి కాదు.
సారా టెండూల్కర్‌తో తన ప్రేమాయణం గురించి వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టాలనే శుబ్‌మన్ గిల్ ఇలా చెప్పి ఉంటాడా? లేక నిజంగానే ఈ ఇద్దరి మధ్య ఏమీ లేదా? అని ఆశ్చర్యపోతున్నారు అభిమానులు...
రిలేషన్‌షిప్‌లో ఉండడం గురించి శుబ్‌మన్ గిల్ చేసిన కామెంట్లు చూస్తుంటే, అదో పెద్ద తలనొప్పిగా భావిస్తున్నట్టు... అంటే శుబ్‌మన్ గిల్‌కీ, సారా టెండూల్కర్‌కీ మధ్య బ్రేకప్ జరిగి ఉండొచ్చని మరికొందరు ఊహించుకుంటున్నారు.
లండన్‌లో మెడిసిన్ పూర్తి చేసిన సారా టెండూల్కర్, ప్రస్తుతం ముంబైలో ఉంటోంది. తన స్నేహితులతో కలిసి హాలీడేస్ ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటోంది సారా..
సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కూడా క్రికెటర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో అర్జున్ టెండూల్కర్‌ని బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్.
అయితే ఐపీఎల్ 2021 సీజన్‌లో జరిగిన ఏడు మ్యాచుల్లో ఒక్క మ్యాచ్‌లో కూడా చోటు దక్కించుకోని అర్జున్ టెండూల్కర్, కనీసం డగౌట్‌లో కూడా కనిపించకపోవడం విశేషం.