జస్ప్రిత్ బుమ్రాలా పాక్ బౌలర్లే కాదు, నేను కూడా బౌలింగ్ చేయలేను! - వసీం అక్రమ్

First Published | Oct 30, 2023, 4:29 PM IST

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో 6 మ్యాచుల్లో 14 వికెట్లు తీసిన జస్ప్రిత్ బుమ్రా, టీమిండయా తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా టాప్‌లో నిలిచాడు. 16 వికెట్లు తీసిన ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ బుమ్రానే..
 

Jasprit Bumrah

ఇంగ్లాండ్‌తో లక్నోలో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 229 పరుగులు మాత్రమే చేసింది. టీమిండియాకి తొలి ఓటమి తప్పదని అనుకున్నారంతా. అయితే వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన జస్ప్రిత్ బుమ్రా, మ్యాచ్‌ని మలుపు తిప్పాడు..
 

16 పరుగులు చేసిన డేవిడ్ మలాన్‌ని క్లీన్ బౌల్డ్ చేసిన జస్ప్రిత్ బుమ్రా, ఆ తర్వాతి బంతికి జో రూట్‌ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. 30 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్, ఆ తర్వాత మహ్మద్ షమీ చెలరేగిపోవడంతో ఏ దశలోనూ కోలుకోలేకపోయింది..
 

Latest Videos


‘పాకిస్తాన్ బౌలర్లు, జస్ప్రిత్ బుమ్రాలా బౌలింగ్ చేయలేరా? అనే ప్రశ్నకు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చాడు.. ‘ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. బుమ్రా చాలా ప్రత్యేకమైన బౌలర్. బుమ్రాలా ప్రపంచంలో ఏ బౌలర్ కూడా బౌలింగ్ చేయలేడు..
 

పాకిస్తాన్ బౌలర్లే కాదు, నేను కూడా బుమ్రాలా వికెట్లు తీయలేను. పాకిస్తాన్ బౌలర్లు టెస్టులు చాలా తక్కువగా ఆడతారు. బుమ్రా టెస్టులు కూడా ఆడతాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత వన్డేలు, టెస్టులు, టీ20లు ఆడుతున్నాడు..
 

Jasprit Bumrah

టెస్టులకు సమాన ప్రాధాన్యం ఇచ్చినప్పుడు వన్డేల్లో బాగా వికెట్లు తీయొచ్చు. వన్డేల్లో సక్సెస్ అయితే, టీ20ల్లో సక్సెస్ కావడం చాలా తేలిక. టెస్టుల్లో వికెట్లు తీయలేకపోతే, వన్డేల్లో క్లిష్టమైన పిచ్‌ల మీద వికెట్లు తీయడం వీలు కాదు..
 

Jasprit Bumrah

పవర్ ప్లే తర్వాత 10 నుంచి 40 ఓవర్ల మధ్య వికెట్లు తీయడం చాలా కష్టం. ఆ ఓవర్లలో వికెట్లు తీయాలంటే స్పెషల్ టాలెంట్ ఉండాలి. జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ యాక్షన్ కూడా విభిన్నంగా ఉంటుంది. అది కూడా అతని సక్సెస్‌కి కారణం..
 

Jasprit Bumrah

అతను బంతికి బయటికి, లోపలికి తేగలడు. పేస్, యార్కర్, బౌన్సర్ ఏదైనా వేయగలడు. అందుకే జస్ప్రిత్ బుమ్రా నా ఉద్దేశంలో కంప్లీట్ బౌలర్..’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ బౌలర్ వసీం అక్రమ్.. 

click me!