Ravichandran Ashwin
2011 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్న రవిచంద్రన్ అశ్విన్, 2 మ్యాచులు ఆడి 4 వికెట్లు తీశాడు. 2015 వన్డే వరల్డ్ కప్‌లో 8 మ్యాచుల్లో 13 వికెట్లు తీసిన అశ్విన్, 2019 వన్డే వరల్డ్ కప్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు..
2015 వన్డే వరల్డ్ కప్‌కి ఎంపికైనా రిజర్వు బెంచ్‌లోనే కూర్చున్నాడు అక్షర్ పటేల్. 2019 వన్డే వరల్డ్ కప్‌కి ఎంపిక కాని అక్షర్ పటేల్, 2023 ప్రపంచ కప్‌కి ఎంపికైనా ఫిట్‌నెస్ లేకపోవడంతో ఈసారి కూడా వరల్డ్ కప్ ఆడే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు..
Ravichandran Ashwin
2011 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌లో సభ్యుడిగా ఉండి, 2023 వన్డే వరల్డ్ కప్ ఆడబోతున్న రెండో భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. విరాట్ కోహ్లీ కూడా 2011 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు..
వార్మప్ మ్యాచుల ఆరంభానికి ముందు టీమ్‌లో అక్షర్ పటేల్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌కి చోటు కల్పిస్తున్నట్టు ప్రకటించింది సెలక్షన్ కమిటీ. 2010లో వన్డే ఆరంగ్రేటం చేసిన అశ్విన్, 115 వన్డేల్లో 155 వికెట్లు తీశాడు..
Ravichandran Ashwin
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి వన్డేలో 47 పరుగులిచ్చి ఓ వికెట్ తీసిన అశ్విన్, రెండో వన్డేలో 41 పరుగులకు 3 వికెట్లు తీసి సెలక్టర్లను ఇంప్రెస్ చేశాడు. మూడో వన్డేలో అశ్విన్ ప్లేస్‌లో వాషింగ్టన్ సుందర్‌కి అవకాశం దక్కింది..
Ravichandran Ashwin
వాషింగ్టన్ సుందర్, రాజ్‌కోట్‌లోని బ్యాటింగ్ పిచ్‌లో 10 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి 48 పరుగులే ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో భారత బౌలర్లలో 6లోపు ఎకానమీతో బౌలింగ్ చేసింది సుందర్ ఒక్కడే. అతన్ని ఓపెనర్‌గానూ ఆడించింది టీమిండియా..
Ravichandran Ashwin
ఓపెనర్‌గా వచ్చిన వాషింగ్టన్ సుందర్ 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సుందర్ మరీ ఫ్లాప్ కాకపోయినా రవిచంద్రన్ అశ్విన్ అనుభవం టీమిండియాకి బాగా ఉపయోగపడుతుందని ఉద్దేశంతో అతనికే ఓటు వేశారు సెలక్టర్లు..
Ravichandran Ashwin
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన రవిచంద్రన్ అశ్విన్, వరుసగా మూడో వైట్ బాల్ ఐసీసీ వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆడబోతుండడం విశేషం..