వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ డిజైన్ వెనక ఇన్ని విషయాలు దాగి ఉన్నాయా... అందుకే దీనికి ఇంత క్రేజ్..

First Published | Sep 28, 2023, 4:24 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి కౌంట్ డౌన్ మొదలైపోయింది. వార్మప్ మ్యాచులు మరికొన్ని గంటల్లో మొదలవుతుంటే, వచ్చే వారం మెగా టోర్నీకి తెర లేవనుంది. వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ వెనకాల చాలా పెద్ద కథే ఉంది..

1975లో క్రికెట్ ప్రపంచ కప్‌ని ప్రుడెన్షియల్ కప్ అని పిలిచేవారు. ఆరంభంలో ప్రపంచ కప్, ప్రతీ ఎడిషన్‌కి మారుతూ వచ్చింది. 1996 వరల్డ్ కప్ తర్వాత ఐసీసీ, ప్రపంచ కప్‌కి ఓ స్థిరమైన డిజైన్ రూపొందించాలని భావించింది..
 

1999 వరల్డ్ కప్ నుంచి ఇప్పటిదాకా ఒకే డిజైన్‌లో వన్డే ప్రపంచ కప్ ట్రోఫీ రూపొందుతోంది. ఈ ట్రోఫీని పూర్తిగా బంగారం, వెండి వాడి తయారుచేస్తారు. మధ్యలో ఉండే గ్లోబ్ డిజైన్ క్రికెట్ బాల్‌నీ, భూగోళాన్ని ప్రతిబింబిస్తుంది..
 


భూమధ్యరేఖను పోలి ఉండే సీమ్ కూడా ఈ గ్లోబ్‌పై ఉంటుంది. అంతేకాదు దీనిపై 3 సిల్వర్ కాలమ్స్ కూడా ఉంటాయి. ఇవి క్రికెట్ స్టంప్స్‌కి ప్రతిరూపంగా రూపొందించినవి. 

అంతేకాదు క్రికెట్ ఆటలో ప్రధానమైన బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ మూడింటినీ ఈ మూడు లైన్స్‌ గుర్తుగా సూచిస్తారు. ఈ మూడింట్లో ఏదీ తక్కువ కాదనే విషయాన్ని ప్రపంచ కప్ ట్రోఫీ తెలియచేస్తోంది.. 
 

ఈ ప్రపంచ కప్ ట్రోఫీని 1999లో లండన్‌లోని పాల్ మార్స్‌డెన్ ఆఫ్ గెరార్డ్ అండ్ కో. కంపెనీ రూపొందించింది. దీని బరువు 11 కిలోలు ఉంటే, ఎత్తు 65 సెంటిమీటర్లు ఉంటుంది.. బరువు, ఎత్తు దృష్ట్యాలో ప్రపంచంలోనే అతి పెద్ద ట్రోఫీ ఇదే. ఫిఫా వరల్డ్ కప్ బరవు 6 కిలోలే, ఎత్తు 37 సెంటీమీటర్లే..

Latest Videos

click me!