వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీలో 5 సెంచరీలతో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన రోహిత్ శర్మ, ప్రపంచ కప్‌లో 7 సెంచరీలు చేసిన మొట్టమొదటి బ్యాటర్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు. అంతేకాదు టీమిండియా నుంచి వచ్చిన గత 10 సెంచరీల్లో 7 సెంచరీలు రోహిత్ శర్మ బ్యాటు నుంచే రావడం విశేషం..
2015 వన్డే వరల్డ్ కప్‌లో జింబాబ్వేపై 110 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు సురేష్ రైనా. అదే టోర్నీలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 137 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. రోహిత్‌కి ఇదే మొట్టమొదటి వన్డే వరల్డ్ కప్ సెంచరీ..
2019 వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో 122 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. అదే టోర్నీలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో 117 పరుగులు చేశాడు శిఖర్ ధావన్..
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 140 పరుగులు చేసిన రోహిత్ శర్మ, ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో 102 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌పై 104, శ్రీలంకపై 103 పరుగులు చేసి... 5 సెంచరీల రికార్డుతో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు గెలిచాడు..
2019 వన్డే వరల్డ్ కప్‌లో శ్రీలంకతో మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ కూడా సెంచరీ చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో 131 పరుగులతో చెలరేగాడు రోహిత్ శర్మ...
అప్పుడెప్పుడో 2011లో బంగ్లాదేశ్‌పై 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, 2015లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 107 పరుగులు చేశాడు. ఆ తర్వాత గత 2019 వన్డే వరల్డ్ కప్‌లో 5 హాఫ్ సెంచరీలు చేసిన విరాట్, సెంచరీ మార్క్ మాత్రం అందుకోలేకపోయాడు..