India Vs Australia
టీమిండియా జరిగిన వరల్డ్ కప్ మొదటి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓడింది భారత జట్టు. చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 199 పరుగులకే ఆలౌట్ అయ్యింది... ఈ లక్ష్యఛేదనలో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది భారత జట్టు...
అయితే విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ కలిసి నాలుగో వికెట్‌కి 165 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసి, మ్యాచ్‌ని గెలిపించారు.. ఈ మ్యాచ్ తర్వాత సౌతాఫ్రికాతో మ్యాచ్ ఆడుతోంది ఆస్ట్రేలియా...
‘ఆస్ట్రేలియా మొదటి మ్యాచ్‌లో ఆడిన విధానం నాకైతే సంతృప్తిని ఇచ్చింది. ఎందుకంటే ఇండియాతో ఇండియాలో మ్యాచ్ ఆడుతున్నప్పుడు అదిరిపోయే పర్ఫామెన్స్ ఆశించడం కరెక్ట్ కాదు. చెన్నై పిచ్‌లో బ్యాటింగ్ చాలా కష్టంగా ఉంటుంది..
అయితే ఆస్ట్రేలియా మరో మ్యాచ్ ఓడితే సెమీ ఫైనల్ రేసు క్లిష్టం అవుతుంది. అయితే ఆస్ట్రేలియాకి టేబుల్ టాపర్‌గా నిలవడం ఎలాగో బాగా తెలుసు..
జట్టు మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇది చాలా మంచి టీమ్. ఎంతో సత్తా ఉన్న టీమ్. టీమ్‌లో చాలా మంది ఆల్‌రౌండర్లు ఉన్నారు. స్పిన్ బౌలర్లకు ప్రధానం ఇవ్వాలి. ఆడమ్ జంపాపైన భారీ భాద్యత ఉంది..
తుది జట్టులో ఆడమ్ జంపా, గ్లెన్ మ్యాక్స్‌వెల్ మాత్రమే స్పిన్నర్లుగా ఉన్నారు. ఇండియాలో పిచ్‌లు స్పిన్‌కి చక్కగా అనుకూలిస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.. ’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్..