200 పరుగుల లక్ష్యఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ ముగ్గురూ డకౌట్ కావడంతో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఈ దశలో కెఎల్ రాహుల్‌తో కలిసి నాలుగో వికెట్‌కి 165 పరుగుల విలువైన భాగస్వామ్యం జోడించాడు విరాట్ కోహ్లీ..
Virat Kohli
‘చిన్నప్పటి నుంచి నేను ఆడుతూ పెరిగిన స్టేడియం ఇది (ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం). ఇక్కడే రంజీ క్రికెట్ ఆడాను. ఇదే స్టేడియంలో ఇండియా తరుపున మ్యాచులు కూడా ఆడాను...
Virat Kohli
ఆ క్షణాలు ఇంకా మనసులో అలాగే ఉన్నాయి. నాకు ఇంకా నిన్నే మొదలైనట్టుగా ఉంది. సెలక్టర్లు, నన్ను మొదటిసారి చూడడం, అవకాశం ఇవ్వడం అన్నీ ఇక్కడే జరిగాయి. అరుణ్ జైట్లీ స్టేడియంలో మళ్లీ ఆడడం చాలా స్పెషల్..
Virat Kohli
నా పేరు పెట్టిన పెవిలియన్ ముందు ఆడడం మాత్రం నాకు ఏదోలా ఉంటుంది. నాకు ఇది పెద్దగా నచ్చలేదు. ఇది చాలా గొప్ప గౌరవం. ఈ స్టేడియంలో మొదటిసారి ఆడినప్పుడు ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు..’ అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ..
Virat Kohli
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ ఆడనుంది భారత జట్టు..