ఇప్పటికైతే వరల్డ్ కప్ టీమ్‌లో మార్పులేమీ లేవు! ఉంటే వాళ్లే చెబుతారు.. - రాహుల్ ద్రావిడ్

Published : Sep 28, 2023, 01:55 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ కోసం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే ప్రపంచ కప్‌కి ఎంపికైన టీమ్‌లో ఉన్న అక్షర్ పటేల్ గాయపడడంతో అతని ప్లేస్‌లో రవిచంద్రన్ అశ్విన్‌కి చోటు దక్కవచ్చని ప్రచారం జరిగింది. ఈ విషయంపై హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించాడు..

PREV
16
ఇప్పటికైతే వరల్డ్ కప్ టీమ్‌లో మార్పులేమీ లేవు! ఉంటే వాళ్లే చెబుతారు.. - రాహుల్ ద్రావిడ్

ఆస్ట్రేలియాతో మూడో వన్డేకి ప్రకటించిన జట్టులో అక్షర్ పటేల్‌ పేరు కూడా ఉంది. అయితే గాయం నుంచి అక్షర్ పటేల్ పూర్తిగా కోలుకోకపోవడంతో వాషింగ్టన్ సుందర్‌కి తుది జట్టులో చోటు దక్కింది. ఇషాన్ కిషన్ జ్వరంతో బాధపడుతుండడంతో సుందర్ ఓపెనింగ్ కూడా చేశాడు..

26
Rahul Dravid-Hardik Pandya

‘మొదటి రెండు వన్డేల్లో రవిచంద్రన్ అశ్విన్ చక్కగా బౌలింగ్ చేశాడు. అలాగే కెఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ కూడా బాగుంది. దాదాపు 6-7 నెలల పాటు క్రికెట్‌కి దూరంగా ఉన్న రాహుల్, వికెట్ కీపింగ్ చేయగలడా? లేదా? అనే అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు అవి పూర్తిగా పోయాయి..

36
Ravichandran Ashwin

అక్షర్ పటేల్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అయితే ఎన్‌సీఏలో సెలక్టర్లు, అజిత్ అగార్కర్.. అతని ఫిట్‌నెస్‌ని పర్యవేక్షిస్తున్నారు. రవిచంద్రన్ అశ్విన్‌కి వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కుతుందా? లేదా? అనేది తెలీదు..

46

ఇప్పటికైతే దాని గురించి నేనేమీ కామెంట్ చేయలేదు. మార్పులు ఏమైనా ఉంటే బీసీసీఐ సెలక్టర్లు అధికారికంగా ప్రకటిస్తారు. అప్పటిదాకా వేచి చూడాల్సిందే. ఇప్పటికైతే వరల్డ్ కప్ టీమ్‌లో ఏ మార్పులు లేవు..
 

56
Axar Patel-Ashwin

జస్ప్రిత్ బుమ్రా, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లకు విలువైన గేమ్ టైమ్ దక్కింది. జస్ప్రిత్ బుమ్రా 10 ఓవర్ల పాటు బౌలింగ్ చేయగలిగాడు. సిరాజ్ ఓ గాయంతో బాధపడుతున్నాడు. అయితే చాలా వరకు కోలుకుని, రీఎంట్రీ ఇచ్చాడు..

66

రెండు ప్రాక్టీస్ గేమ్స్‌లో టీమ్ కాంబినేషన్ విషయంపై ప్రత్యేక దృష్టి పెడతాం. అయితే వార్మప్ మ్యాచుల్లో సీరియస్‌గా ఆడాలని ఆశించడం కష్టం. వాతావరణం మారుతోంది. ఎండలు పెరుగుతున్నాయి. కాబట్టి ప్లేయర్లకు వాతావరణమే చాలా పరీక్షలు పెట్టనుంది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.. 

click me!

Recommended Stories