భారత బౌలర్లకు వేరే బాల్ ఇస్తున్నారు! అందుకే ఇలా వికెట్లు తీస్తున్నారు... - పాక్ మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్

First Published | Nov 3, 2023, 3:14 PM IST

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్ బౌలింగ్ యూనిట్ దుమ్మురేపుతుందని విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు అంచనా వేశారు. అయితే వరల్డ్ క్లాస్ బౌలింగ్ యూనిట్‌గా పేరు తెచ్చుకున్న పాక్ బౌలర్లు ఫ్లాప్ కాగా, భారత బౌలింగ్ యూనిట్ అదరగొడుతోంది..

Mohammed Shami

గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌కి తోడు సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కూడా ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తున్నారు. పాక్ బౌలర్లు ఫెయిలైన చోట, భారత బౌలర్లు రాణిస్తుండడంతో ఆ దేశ మాజీ క్రికెటర్ హసన్ రాజా షాకింగ్ ఆరోపణలు చేశాడు...

‘భారత బౌలర్లు మిగిలిన బౌలర్ల కంటే ఎక్స్‌ట్రా సీమ్, స్వింగ్ రాబడుతున్నారు. ఇండియన్ బౌలర్లు చెలరేగిన చోట, భారత బ్యాటర్లు  ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా బ్యాటింగ్ చేయగలుగుతున్నారు.
 

Latest Videos


Team India

నాకు టీమిండియా బౌలింగ్ చేసేటప్పుడు ఐసీసీ, వాళ్లకి వేరే బాల్స్ ఇస్తోందా? అని అనుమానం కలుగుతోంది. బీసీసీఐ, థర్డ్ అంపైర్ కలిసి ఈ గోల్‌మాల్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. 

Siraj

మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ బౌలింగ్ చూస్తుంటే సౌతాఫ్రికా బౌలర్లు అలెన్ డొనాల్డ్, మక్కాయ ఎన్తినీ గుర్తుకు వస్తున్నారు.  వాళ్లు ఓ బంతి ఇన్‌స్వింగ్ వేస్తారు, మరో అవుట్ స్వింగ్ వేస్తారు.

టీమిండియా బ్యాటింగ్ చేసి 360 పరుగులు చేశాక, అదే పిచ్ మీద శ్రీలంక 60 కూడా చేయలేకపోయింది. భారత బౌలర్లు వేసే బంతులకు ఎక్స్‌ట్రా లేయర్ ఉంటోందా? లేక ఎక్స్‌ట్రా కోటింగ్ చేస్తున్నారా? దీనిపైన ఐసీసీ కచ్ఛితంగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది..’ అంటూ వ్యాఖ్యలు చేశాడు హసన్ రాజా..

హసన్ రాజా వ్యాఖ్యలపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. ‘ఇది సీరియస్ క్రికెట్ షోనా? లేక కామెడీ, సెటైరికల్ షోగా. అక్కడ ఉర్దూలో ఏం రాసి ఉందో నాకు తెలీదు. వీళ్ల కామెంట్లు చూస్తుంటే అది కామెడీ షోనే అయ్యుంటుంది..’ అంటూ కామెంట్ చేశాడు ఆకాశ్ చోప్రా.. 

click me!