పాకిస్తాన్ ఆర్డినరీ టీమ్ కూడా కాదు, బీలో ఆర్టినరీ టీమ్! వాళ్లకి అంత సీన్ లేదు... - హర్భజన్ సింగ్

First Published | Oct 5, 2023, 2:42 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో దాదాపు లక్షా 30 వేల మంది అభిమానుల మధ్య అక్టోబర్ 14న ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ గురించి మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, హర్భజన్ సింగ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు..

India vs Pakistan

‘టీమిండియా వరల్డ్ కప్ గెలవాలంటే పాకిస్తాన్‌తో మ్యాచ్ చాలా ముఖ్యం. ఎందుకంటే భారత్ ప్రపంచ కప్ గెలవకపోయినా పర్లేదు, పాకిస్తాన్‌తో మాత్రం ఓడిపోకూడదని చాలా మంది కోరుకుంటారు. కామన్ మ్యాన్‌ కూడా ఇదే కోరుకుంటాడు...’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్...

‘నాకైతే పాకిస్తాన్‌, వరల్డ్ కప్‌లో అదరగొడుతుందని అనిపించడం లేదు. వాళ్లు టీ20ల్లో బాగా ఆడతారు. వారి ఫాస్ట్ బౌలింగ్ యూనిట్, టీ20లకు సరిగ్గా సరిపోతుంది. అయితే వన్డేల్లో మాత్రం వాళ్లు ఉత్తుత్తి టీమ్‌..

Latest Videos


ఆసియా కప్‌లో కానీ వార్మప్ మ్యాచుల్లో కానీ నాకు ఇదే కనిపించింది. నా వరకూ పాకిస్తాన్ బిలో ఆర్డినరీ టీమ్. వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై భారత్‌కి ఉన్న రికార్డు మారుతుందని అయితే నాకు అనిపించడం లేదు..’ అంటూ వ్యాఖ్యానించాడు హర్భజన్ సింగ్..
 

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ముందు వరకూ పాకిస్తాన్, టీమిండియాపై ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే 2021 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌, టీమిండియాపై 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

ఈ మ్యాచ్ తర్వాత జరిగిన ఆసియా కప్ 2022 టోర్నీలోనూ ఇండియాపై విజయాన్ని అందుకుంది పాకిస్తాన్. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్‌ని ఓడించి, ప్రతీకారం తీర్చుకుంది భారత్. అయితే పాకిస్తాన్, ఈ టోర్నీలో లక్కీగా ఫైనల్‌కి వెళ్లింది..
 

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు జరిగిన ఆసియా కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్, టీమిండియా చేతుల్లో 228 పరుగుల తేడాతో ఓడింది. శ్రీలంకతో మ్యాచ్‌లోనూ పాకిస్తాన్‌కి పరాజయమై ఎదురైంది. రెండు వార్మప్ మ్యాచుల్లో పాకిస్తాన్ భారీ స్కోరు చేసినా విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది..

click me!