హైదరాబాద్ : భారతదేశం విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలే సమ్మేళనమే కాదు రకరకాల వంటకాలకు కూడా ప్రసిద్ది. దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకం వంటకాలు స్పెషల్... ఇలా మన హైదరాబాద్ లో బిర్యానీ ఫేమస్. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ హైదరాబాదీ బిర్యానీ గుర్తింపు పొందింది. చివరకు మన దాయాది పాకిస్థాన్ క్రికెటర్లు సైతం హైదరబాదీ బిర్యానీకి ఫిదా అయ్యారంటేనే దీని రుచి ఎంత అమోఘమో అర్థం చేసుకోవచ్చు.