ఆ రోజు గంభీర్ సెంచరీ చేసి, వరల్డ్ కప్ హీరో అయ్యేవాడు, కానీ టీమ్ కోసమే.. - రవిచంద్రన్ అశ్విన్

First Published | Oct 5, 2023, 2:18 PM IST

కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీకి, 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాన్ని క్రెడిట్ దక్కినా... ఈ రెండు మెగా టోర్నీ ఫైనల్స్‌లో అదరగొట్టిన గంభీర్‌కి మాత్రం దక్కాల్సిన క్రెడిట్ దక్కలేదు..

2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో 75 పరుగులు చేసిన గౌతమ్ గంభీర్, 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో 97 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ రెండు మ్యాచుల్లో టాప్ స్కోరర్ గంభీరే..
 

తన 13 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20 మ్యాచులు ఆడిన గౌతమ్ గంభీర్, కెరీర్‌కి సరైన ముగింపు ఇవ్వలేకపోయాడు. కెరీర్‌ ముగింపు దశలో టీమ్ చోటు కోల్పోయిన గంభీర్, ఫేర్‌వెల్ మ్యాచ్ లేకుండానే రిటైర్మెంట్ ప్రకటించాడు..
 

Latest Videos


‘భారత్‌లో గౌతమ్ గంభీర్, అత్యంత అపార్థం చేసుకున్న క్రికెటర్. చాలామంది గంభీర్‌కి పొగరు ఎక్కువని, అందరితో గొడవ పడతాడని, కోపరి అనుకుంటారు. కానీ నిజానికి గంభీర్ చాలా మంచి మనిషి..
 

అతను టీమ్ మ్యాన్. టీమ్ కోసం ఏం చేయడానికైనా ముందుండే వ్యక్తి. అలాగే ముక్కుసూటి మనిషి. ఏం చెప్పాలనుకున్నా, ముఖం మీదే చెప్పేస్తాడు. నిజానికి గంభీర్ చాలా రిజర్వు పర్సన్..

అందరితో అన్నీ పంచుకోలేడు. అయితే మ్యాచ్‌ విషయానికి వస్తే ఫైటర్‌గా మారిపోతాడు. యుద్ధాన్ని కోరుకుంటాడు. గంభీర్ స్పిన్ అద్భుతంగా ఆడతాడు. అంతేకాకుండా మ్యాచ్‌ని అద్భుతంగా అర్థం చేసుకుంటాడు..
 

2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో గంభీర్ ఆడిన ఇన్నింగ్స్, టీమ్‌కి టర్నింగ్ పాయింట్. ఆ టోర్నీలో భారత్ ఫైనల్‌ దాకా వెళ్లడంలోనూ గంభీర్ పాత్ర చాలా ఉంది. ఫైనల్‌లో 2 కీలక వికెట్లు పడిన తర్వాత గంభీర్ ఆడిన ఇన్నింగ్స్ ఎంతో అమూల్యమైనది..

విరాట్ కోహ్లీ, దిల్షాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాక గంభీర్ ప్రెషర్ తీసుకోలేదు. చూడచక్కని షాట్స్‌తో వికెట్ల మధ్య చిరుతలా పరుగెత్తాడు. సెంచరీ చేయాలనుకుంటే చేసుకోవచ్చు కానీ గంభీర్, తన వ్యక్తిగత రికార్డుల కంటే టీమ్ గురించి ఆలోచించాడు..

అతను అదే మ్యాచ్‌లో 120-130 చేసి ఉంటే, ఇప్పుడు వరల్డ్ కప్ క్రెడిట్ మొత్తం అతనికే దక్కేది. కానీ గంభీర్ అలా ఆలోచించే మనిషి కాదు. జనాలు మాత్రం గంభీర్‌ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. గౌతీకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్.. 

click me!