ఐపీఎల్ పర్ఫామెన్స్ కారణంగానే టీమ్‌కి ప్లేయర్లను సెలక్ట్ చేస్తోంది బీసీసీఐ. అభిమానులు కూడా ఇండియన్ టీమ్‌ని చూడకుండా భారత జట్టులోనూ ఐపీఎల్ ఫ్రాంఛైజీలను చూస్తున్నారు. ఫలానా ప్లేయర్ ఆడితే, ఈ ఐపీఎల్ టీమ్ వాడు బాగా ఆడాడని ఆనందపడే పరిస్థితికి వచ్చేశారు..
మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించే చెన్నై సూపర్ కింగ్స్‌లో ఈ వెర్రి మరింత ఎక్కువగా ఉంటుంది. తాజాగా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా చెన్నైలో భారత్, ఆస్ట్రేలియాతో తలబడింది. ఈ మ్యాచ్‌కి వచ్చిన భారతీయుల్లో చాలా మంది, ఆస్ట్రేలియా జెర్సీలో వచ్చి ఆసీస్‌కి సహకరించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది..
దీనికి కారణం ఒక్కటే.. ఆస్ట్రేలియా జెర్సీ ఎల్లో కలర్‌లో ఉంటుంది. సీఎస్‌కే కూడా ఎల్లో జెర్సీలో ఉంటుంది. దీంతో ఎల్లో లవ్ పేరుతో చాలామంది చెన్నై ఫ్యాన్స్, తమ దేశానికి కాకుండా ప్రత్యర్థి దేశానికి సపోర్ట్ చేస్తూ స్టేడియంలో హడావుడి చేశారు..
ఐపీఎల్ అంటే ఇష్టం ఉండొచ్చు. ధోనీ ఆడే ఫ్రాంఛైజీ అంటే పిచ్చి ఉండొచ్చు. కానీ దేశం కంటే ఏదీ ముందు కాదు, ఏదీ ముఖ్యం కాదు. అదీ ప్రపంచ కప్ లాంటి టోర్నీలో సొంత దేశానికి కాకుండా కేవలం ఎల్లోజెర్సీ వేసుకున్నారని ప్రత్యర్థికి సపోర్ట్ చేయడం అంటే అంత కంటే వెర్రితనం ఉండదు..
అయితే ఎల్లో జెర్సీలో వచ్చిన భారత అభిమానులను చూసి, ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ మురిసిపోతోంది. ఇండియాలో తమకి ఇలాంటి సపోర్ట్ దక్కడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది... ఇదే కొనసాగితే, ఈ ఐపీఎల్ పిచ్చి మరిన్ని వైపరిత్యాలకు దారి తీయొచ్చని భయపడుతున్నారు నిజమైన భారత క్రికెట్ ఫ్యాన్స్..