ఈసారి టీమిండియాకి యువరాజ్ సింగ్ అయ్యేది అతనే! మహ్మద్ కైఫ్ కామెంట్...

Published : Oct 08, 2023, 06:38 PM IST

2011 వన్డే వరల్డ్ కప్ విజయంలో కీ రోల్ పోషించాడు ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్. బ్యాటింగ్‌లో 362 పరుగులు చేసిన యువరాజ్ సింగ్, బౌలింగ్‌లో 5.02 ఎకానమీతో 15 వికెట్లు పడగొట్టాడు..

PREV
16
ఈసారి టీమిండియాకి యువరాజ్ సింగ్ అయ్యేది అతనే! మహ్మద్ కైఫ్ కామెంట్...
superstitions of indian cricketers

2011 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు దక్కించుకున్న యువరాజ్ సింగ్‌కి 2015 ప్రపంచ కప్‌లో చోటు దక్కలేదు. 

26
Yuvraj Singh

2015లో టీమిండియా సెమీస్ నుంచి ఇంటిదారి పట్టడానికి యువీ లాంటి ప్లేయర్‌కి చోటు ఇవ్వకపోవడం కూడా ప్రధాన కారణం..

36
Yuvraj Singh

క్యాన్సర్‌తో పోరాడుతూ 2011 వన్డే వరల్డ్ కప్ ఆడిన యువరాజ్ సింగ్, ఆ తర్వాత పేలవ ఫామ్‌తో, ఫిట్‌నెస్ కారణాలతో జట్టులో చోటు కోల్పోయాడు... యువీతో పాటు 2011 వన్డే వరల్డ్ కప్ విజయంలో కీ రోల్ పోషించిన వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ వంటి ప్లేయర్లకు కూడా ఆ తర్వాతి ప్రపంచ కప్‌లో చోటు దక్కలేదు..

46
Hardik Pandya

‘హార్ధిక్ పాండ్యా, తన ప్లాన్ ఆఫ్ యాక్షన్‌ని నెట్స్‌లోనే తయారుచేసుకుంటాడు. ఎక్కవ వర్కవుట్ చేయాలో అతనికి బాగా తెలుసు. ఆఖరి 10 ఓవర్లలో బ్యాటింగ్ చేయడానికి అనుగుణంగా నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తాడు..

56

గ్రౌండ్‌కి అన్ని వైపులా షాట్స్ ఆడగల సామర్థ్యం హార్ధిక్ పాండ్యాకి ఉంది. కొన్నాళ్లుగా హార్ధిక్ పాండ్యా, టాపార్డర్‌లో కూడా బ్యాటింగ్ చేశాడు. ఐపీఎల్‌లో 3, 4 స్థానాల్లో బ్యాటింగ్‌కి వచ్చాడు. టీమిండియాకి ఆరో స్థానంలో ఆడాడు..

66
Ishan Kishan-Hardik Pandya

2011 వన్డే వరల్డ్ కప్‌లో యువరాజ్ సింగ్ ఎలాంటి పాత్ర పోషించాడో, ఆ రోల్‌ని 2023 వన్డే వరల్డ్ కప్‌లో పోషించే సామర్థ్యం హార్ధిక్ పాండ్యాకి ఉంది. ప్రపంచ కప్‌లో అతని పర్ఫామెన్స్, టీమ్‌కి టర్నింగ్ పాయింట్‌ అవుతుంది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ హార్ధిక్ పాండ్యా..

click me!