ఎక్కడ ఆపారో, అక్కడే మొదలెట్టారు... 2019 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై 5/3, ఇప్పుడు ఏకంగా 2/3...

First Published | Oct 8, 2023, 7:09 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీని హాట్ ఫెవరెట్‌గా మొదలెట్టింది భారత జట్టు. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు ఆసియా కప్ 2023 టైటిల్ గెలిచిన భారత జట్టు, ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ కూడా సాధించింది. అయితే ప్రపంచ కప్‌ని మాత్రం అనుకున్నట్టుగా మొదలు పెట్టలేకపోయింది..

Josh Hazlewood

స్పిన్‌కి చక్కగా అనుకూలిస్తున్న చెన్నై పిచ్‌ మీద ఆస్ట్రేలియాని 199 పరుగులకే ఆలౌట్ చేసిన భారత జట్టు, ఈ స్వల్ప లక్ష్యాన్ని మాత్రం సరిగ్గా మొదలెట్టలేకపోయింది. మిచెల్ స్టార్క్‌ బౌలింగ్‌లో మొదటి బంతికే ఇషాన్ కిషన్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు..

Shreyas Iyer

6 బంతులు ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ, హజల్‌వుడ్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. టూ డౌన్‌లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ కూడా 3 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు.. 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది భారత జట్టు..

Latest Videos


Shreyas Iyer

2019 వన్డే వరల్డ్ కప్‌ సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఒక్కో పరుగు చేసి అవుట్ అయ్యారు...

India vs Australia

వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఓపెనర్లు ఇద్దరూ డకౌట్ కావడం 40 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఇంతకుముందు 1983లో జింబాబ్వేతో మ్యాచ్‌లో భారత ఓపెనర్లు సునీల్ గవాస్కర్, కృష్ణమాచారి శ్రీకాంత్ డకౌట్ అయ్యారు..

ఇషాన్ కిషన్ వికెట్‌తో మిచెల్ స్టార్క్, వన్డే వరల్డ్ కప్‌లో 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన బౌలర్‌గా నిలిచాడు మిచెల్ స్టార్క్. లసిత్ మలింగ 26 ఇన్నింగ్స్‌ల్లో 50 వికెట్లు తీయగా, మిచెల్ స్టార్క్ 19 ఇన్నింగ్స్‌ల్లో 50 వరల్డ్ కప్ వికెట్లు తీశాడు..

Mitchell Starc

లసిత్ మలింగ 1187 బంతులు వేసి 50 వన్డే వరల్డ్ కప్ వికెట్లు తీయగా, మిచెల్ స్టార్క్ 941 బంతుల్లోనే ఈ మైలురాయి అందుకున్నాడు. ఓవరాల్‌గా వన్డే వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా నిలిచాడు మిచెల్ స్టార్క్..

ఆసీస్ మాజీ ఫాస్ట్ బౌలర్ గ్లెన్‌ మెక్‌గ్రాత్ 71 వికెట్లు తీయగా శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 68, లసిత్ మలింగ 56, వసీం అక్రమ్ 55 వన్డే వరల్డ్ కప్ వికెట్లు తీసి టాప్‌లో ఉన్నారు. 

click me!