ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌కి ప్రత్యేక ఏర్పాట్లు! పరువు పోగొట్టుకునే పనిలో బిజీగా బీసీసీఐ...

First Published | Oct 11, 2023, 2:09 PM IST

2016 టీ20 వరల్డ్ కప్ తర్వాత ఏడేళ్లకు ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది భారత్. అయితే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆరంభ వేడుకలను నిర్వహించలేదు. తొలుత ప్రారంభ వేడుకల కోసం భారీగా ఏర్పాట్లు చేసినా, ఆఖరి నిమిషంలో క్యాన్సిల్ చేశారు..
 

India vs Pakistan

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ మొదలై 10 రోజులు గడిచిన తర్వాత  ఇప్పుడు అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో జరిగే ఇండియా వర్సెస్ పాకిస్తాన్‌ మ్యాచ్‌కి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ..

ఇండియా- పాకిస్తాన్ మధ్య అక్టోబర్ 14న జరిగే మ్యాచ్‌కి దాదాపు 1 లక్షా 30 వేల మంది హాజరుకాబోతున్నారు. నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం మొత్తం ఫ్యాన్స్‌తో కళకళలాడబోతోంది.. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా సెమీస్ చేరకపోతే మళ్లీ ఇలాంటి సీన్ క్రియేట్ చేయడం వీలు కాదు..

Latest Videos


అందుకే అక్టోబర్ 14న ఇండియా- పాక్ మ్యాచ్‌కి ముందు కొన్ని ప్రోగ్రామ్స్‌ నిర్వహించబోతోంది బీసీసీఐ. బాణసంచాలతో ఓ కలర్ ఫుల్ లైట్ సోతో పాటు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీ కాంత్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌.. ఈ మ్యాచ్‌కి ముఖ్యఅతిథులుగా హాజరుకాబోతున్నారు..
 

అలాగే బాలీవుడ్ సింగర్ అరిజిత్‌ సింగ్‌తో లైవ్ మ్యూజిక్ ఈవెంట్ కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే బీసీసీఐ పరువు పోగొట్టుకోవడం ఖాయం. ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌కి ఎంత క్రేజ్ ఉన్నా... వరల్డ్ కప్ ఆరంభ వేడుకలు చేయకుండా ఈ మ్యాచ్‌కి స్పెషల్ ఏర్పాట్లు చేయడం కరెక్ట్ కాదు..
 

ఇలాగే ఆసియా కప్ 2023 టోర్నీలో ఇండియా - పాకిస్తాన్ సూపర్ 4 మ్యాచ్‌కి మాత్రమే రిజర్వు డే పెట్టి పరువు పోగొట్టుకుంది భారత్. ఇప్పుడు కూడా మెగా ఈవెంట్‌ని కాదని, అందులో ఒక్క మ్యాచ్‌కి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం... వరల్డ్ ఈవెంట్‌‌లో పాల్గొంటున్న మిగిలిన టీమ్స్‌ని అవమానించడమే అవుతుంది..

మరీ అంతగా ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌‌కి గ్రాండ్ సెలబ్రేషన్స్ చేయాలని అనుకుంటే, ఆ మ్యాచ్‌ని వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆరంభ మ్యాచ్‌గా పెట్టాల్సింది. అప్పుడు ఎలాంటి అభ్యంతరాలు వచ్చేవి కాదు. ఇలా టోర్నీ మొదలయ్యాక 10 రోజులకు జరిగే మ్యాచ్‌ని ప్రత్యేకంగా చూడడం మాత్రం కరెక్ట్ కాదని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. 

click me!