టీమిండియాతో మ్యాచ్‌లో 199 పరుగులకి ఆలౌట్ అయిన ఆస్ట్రేలియా... సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో 56 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది..
India Vs Australia
మిచెల్ మార్ష్ 7, డేవిడ్ వార్నర్ 13, స్టీవ్ స్మిత్ 19, జోష్ ఇంగ్లీష్ 5 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 312 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియాకి ఆశించిన ఫలితం దక్కలేదు..
Australia
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆస్ట్రేలియా మిగిలిన అన్ని జట్లకంటే పేలవ ఫీల్డింగ్‌తో క్యాచ్ ఎఫిషియెన్సీ రేషియోలో ఆఖరి పొజిషన్‌లో నిలిచింది.. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఏకంగా అరడజను క్యాచులను నేలపాలు చేసింది ఆస్ట్రేలియా..
డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్క్, జోష్ హజల్‌వుడ్ వంటి ఎంతో అనుభవం ఉన్న ప్లేయర్లతోనే 2023 వన్డే వరల్డ్ కప్ బరిలో దిగింది ఆస్ట్రేలియా..
అయితే చెన్నైలో టీమిండియాతో మ్యాచ్‌లో 199 పరుగులకే ఆలౌట్ కావడం, ఆస్ట్రేలియాపై తీవ్రంగా ప్రభావం చూపించినట్టు తెలుస్తోంది. అదీకాకుండా ప్రపంచ కప్‌కి ముందు సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడింది ఆస్ట్రేలియా. ఈ సిరీస్‌లో మొదటి రెండు వన్డేలు గెలిచినా, వరుసగా 3 మ్యాచులు ఓడి సిరీస్ కోల్పోయింది..
సౌతాఫ్రికా తర్వాత టీమిండియాతోనూ సిరీస్ కోల్పోయింది. ఇదే ఆస్ట్రేలియాపై ప్రభావం చూపించింది. అయితే రెండు మ్యాచులు ఓడినంత మాత్రాన ఆసీస్‌ని తక్కువ అంచనా వేయడానికి లేదు. 2003, 2007 వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని రికార్డు ఆసీస్‌ది. ఒక్కసారి ఫామ్‌లోకి వస్తే, ఆసీస్‌ని ఆపడం కష్టమే..