వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిన ఆసీస్, రెండో మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతుల్లో 134 పరుగుల తేడాతో పరాజయం పాలైంది..
AUSTRALIA
ఈ రెండు పరాజయాలతో -1.846 నెట్ రన్‌రేట్‌తో ఆఖరి స్థానంలో నిలిచింది ఆస్ట్రేలియా. మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన శ్రీలంక, నెదర్లాండ్స్ కూడా మెరుగైన రన్‌రేట్‌తో ఆస్ట్రేలియా కంటే టాప్‌లో నిలిచాయి..
మొదటి రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడిన ఆఫ్ఘనిస్తాన్, డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌పై 69 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుని... టాప్ 6లోకి దూసుకెళ్లింది. దీంతో 9వ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా.. ఆఖరి స్థానానికి పడిపోవాల్సి వచ్చింది..
శ్రీలంకతో లక్నోలో మ్యాచ్ ఆడుతోంది ఆస్ట్రేలియా. ఈ మ్యాచ్ గెలవడం ఆస్ట్రేలియా పరువు సమస్య. ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే 2023 వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ ఛాన్సులు పూర్తిగా ఆవిరైపోతాయి...
శ్రీలంక కూడా మొదటి రెండు మ్యాచుల్లో విజయాలు అందుకోలేకపోయింది. అయితే రెండు మ్యాచుల్లోనూ బ్యాటింగ్‌లో మంచి పోరాటం చూపించింది. సౌతాఫ్రికాపై 326 పరుగులు చేసిన లంక, పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 344 పరుగుల భారీ స్కోరు చేసినా దాన్ని కాపాడుకోలేకపోయింది.
ఆస్ట్రేలియాపై టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌లో 280-320 స్కోరు చేస్తే, బౌలర్లు సరిగ్గా రాణిస్తే దాన్ని కాపాడుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. వానిందు హసరంగ గాయపడడం, భారీ ఆశలు పెట్టుకున్న మహీశ్ తీక్షణ, మతీశ పథిరాణా ఘోరంగా విఫలమవుతుండడం లంకను ఇబ్బందిపెడుతోంది..