2011 వరల్డ్ కప్ ఆడి ఉంటే, రోహిత్ శర్మ ఇలా మారేవాడు కాదు! వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్..

First Published | Oct 14, 2023, 7:16 PM IST

2007 టీ20 వరల్డ్ కప్ ఆడిన రోహిత్ శర్మ, ఆ తర్వాత నాలుగేళ్లకు జరిగిన 2011 వన్డే వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఆరంభంలోనే సత్తా ఉన్న ప్లేయర్‌గా నిరూపించుకున్నా, నిలకడలేమి కారణంగా రోహిత్ శర్మకు 2011 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కలేదు..

Rohit Sharma

2011 వన్డే వరల్డ్ కప్ ఆడిన విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్.. 2023 వన్డే వరల్డ్ కప్ ఆడుతున్నారు. 2007 టీ20 వరల్డ్ కప్ ఆడిన టీమ్‌లో రోహిత్ శర్మ ఒక్కడే, 2023 వన్డే వరల్డ్ కప్‌లోనూ ఆడుతున్నాడు...

Rohit Sharma-Shewag

2011 వన్డే వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకోలేకపోయిన రోహిత్ శర్మ, 2023 ప్రపంచ కప్‌లో భారత జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. ఫైవ్ టైం ఐపీఎల్ విన్నర్ రోహిత్ శర్మపై భారీ అంచనాలు ఉన్నాయి..


Rohit Sharma

‘2011 వన్డే వరల్డ్ కప్ సమయంలో నేను టీమిండియా కెప్టెన్‌‌గా ఉన్నా, లేక సెలక్టర్‌గా ఉన్నా.. కచ్ఛితంగా రోహిత్ శర్మను సెలక్ట్ చేసి ఉండేవాడిని. అయితే అప్పుడున్న రోహిత్, ఇప్పుడు మనం చూస్తున్న రోహిత్ ఒక్కరు కాదు..

ఆ టైమ్‌లో రోహిత్ శర్మ కుర్రాడు. దూకుడుగా ఎక్కువగా ఉండేది. టీమ్ కాంబినేషన్ కోసం కెప్టెన్, సెలక్టర్లు కలిసి రోహిత్ శర్మను పక్కనబెట్టాలని నిర్ణయం తీసుకున్నారు..

అయితే 2011 వన్డే వరల్డ్ కప్ ఆడి ఉంటే, రోహిత్ శర్మ ఇప్పుడిలా ఉండేవాడు కాదు. ఎందుకంటే అప్పుడు పక్కనబెట్టడం వల్లే అతను కసిగా తనను తాను మెరుగుపర్చుకున్నాడు. నిలకడగా రాణించడం మొదలెట్టాడు..

టీమ్‌లో ఉండాలంటే ఎలా ఆడాలో తెలుసుకున్నాడు, అన్నింటికీ మించి మరోసారి వరల్డ్ కప్ జట్టులో చోటు కోల్పోకూడదని కసిగా ప్రాక్టీస్ చేశాడు.. ’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. 

Latest Videos

click me!