నేను క్యాన్సర్‌తో బాధపడుతూ వరల్డ్ కప్ ఆడా! లేచి ఆడు... శుబ్‌మన్ గిల్‌కి ఫోన్ చేసి చెప్పిన యువరాజ్ సింగ్...

Published : Oct 14, 2023, 06:27 PM IST

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు సుప్రీమ్ ఫామ్‌లో ఉన్నాడు శుబ్‌మన్ గిల్. ఈ ఏడాది ఇప్పటికే వన్డేల్లో 1200+ పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, ఐసీసీ నెం.1 వన్డే బ్యాటర్ ర్యాంకు కోసం పోటీపడుతున్నాడు...

PREV
16
నేను క్యాన్సర్‌తో బాధపడుతూ వరల్డ్ కప్ ఆడా! లేచి ఆడు... శుబ్‌మన్ గిల్‌కి ఫోన్ చేసి చెప్పిన యువరాజ్ సింగ్...

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు శుబ్‌మన్ గిల్ డెంగ్యూ బారిన పడి, మొదటి రెండు మ్యాచులకు దూరమయ్యాడు. చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఆడని శుబ్‌మన్ గిల్, ఆ తర్వాత ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లోనూ ఆడలేదు..

26
Yuvraj Singh

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చిన శుబ్‌మన్ గిల్, 4 ఫోర్లతో 16 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. శుబ్‌మన్ గిల్‌ మెంటర్ యువరాజ్ సింగ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు..

36

‘శుబ్‌మన్ గిల్ డెంగ్యూతో బాధపడుతూ మొదటి రెండు మ్యాచులు ఆడలేదని తెలియగానే నేను అతనికి కాల్ చేసి మాట్లాడను. నేను డెంగ్యూతో బాధపడుతూ రెండు సార్లు ఆడాను..

46

వరల్డ్ కప్‌లో అయితే నా ఆరోగ్యం అస్సలు బాగోలేదు. క్యాన్సర్‌తో బాధపడుతూనే మ్యాచ్ ఆడాను. ఎందుకంటే ప్రపంచ కప్‌ టోర్నీ నాకు, భారత్‌కి చాలా అవసరం. కాబట్టి పడుకుంది చాలు, ఇక లేచి ఆడు అని చెప్పాను..

56

అయితే నేనేం చెప్పినా, అతనికి ఆడాలని ఉంటేనే ఆడతాను. వైరల్ ఫివర్‌కి, డెంగ్యూకి చాలా తేడా ఉంది. డెంగ్యూ మీ శరీరంలోని ప్రతీ భాగాన్ని బలహీనపరుస్తుంది. అయితే పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అతను ఆడతాడని అనుకుంటున్నా..
 

66
Sanju Samson and Shubman Gill

ఆరంభంలో ఒకటి, రెండు వికెట్లు పడినా కూడా మేం ఏ మాత్రం కంగారుపడకుండా ఆడాం. మిడిల్ ఆర్డర్‌లో అనుభవం ఉన్న ప్లేయర్లు ఉండడం వల్ల మంచి స్కోరు చేయగలిగాం.. పాకిస్తాన్ మ్యాచ్‌లో తెలియకుండా రెట్టింపు ఉత్సాహం వచ్చేస్తుంది... ’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. 

Read more Photos on
click me!

Recommended Stories