ఇద్దరు తక్కువైనా సరే, 9 మందితో మ్యాచ్ ఆడేయొచ్చు... వన్డే వరల్డ్ కప్‌ 2022 టోర్నీకి...

Published : Feb 26, 2022, 04:49 PM IST

ప్రపంచంపై కరోనా ప్రభావం తగ్గినా, కరోనా కేసుల కారణంగా క్రికెట్ మ్యాచులకు అంతరాయం కలుగుతూనే ఉంది. నెల రోజుల కిందట జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీని కూడా కరోనా వదలలేదు...

PREV
110
ఇద్దరు తక్కువైనా సరే, 9 మందితో మ్యాచ్ ఆడేయొచ్చు... వన్డే వరల్డ్ కప్‌ 2022 టోర్నీకి...

భారత జట్టులో ఆరుగురు ప్లేయర్లు కరోనా బారిన పడి, రెండు మ్యాచులకు దూరం కాగా... మ్యాచ్‌లు ఆడేందుకు కావాల్సిన 11 మంది ప్లేయర్లు అందుబాటులో లేక కెనడా టోర్నీ మధ్యలోనే స్వదేశానికి పయనమైంది...

210

మార్చి 4 నుంచి న్యూజిలాండ్ వేదికగా ప్రారంభమయ్యే మహిళా వన్డే వరల్డ్ కప్ టోర్నీపై కూడా కరోనా ప్రభావం పడే అవకాశం ఉండడంతో కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది ఐసీసీ..

310

కరోనా కారణంగా పూర్తి ప్లేయర్లు అందుబాటులో లేకపోతే 9 మంది ప్లేయర్లతో బరిలో దిగేందుకు అవకాశం కల్పించింది ఐసీసీ..

410

మ్యాచ్ టైమ్‌లో సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లు అందుబాటులో లేకపోతే టీమ్ మేనేజ్‌మెంట్, కోచింగ్ స్టాఫ్‌లోని మహిళా సభ్యులు కూడా ఫీల్డింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది...

510

అయితే వీరికి బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ చేసేందుకు అవకాశం ఉండదు. వీరిని నాన్ బౌలింగ్, నాన్ బ్యాటింగ్ సబ్‌స్టిట్యూట్‌లుగా అనుమతిస్తారు...

610

కరోనా కారణంగా 9 మందితో ఆడే జట్టుకి, ప్రత్యర్థి జట్టు కూడా ఇలాగే 9 మంది ప్లేయర్లతో బరిలో దిగాల్సి ఉంటుంది. మరీ అవసరమైతే మ్యాచ్‌ను  రీషెడ్యూల్ చేసి నిర్వహించేందుకు కూడా అనుమతి ఇచ్చింది...

710

సాధారణంగా ఐసీసీ టోర్నీల్లో పాల్గొనే అన్ని దేశాలకు 15 మందితో కూడిన జట్టుతో పాటు ముగ్గురు రిజర్వు ప్లేయర్లను అనుమతిస్తారు...

810

స్టాండ్ బై ప్లేయర్లుగా ఉన్న ఈ ముగ్గురు ప్లేయర్లు, ప్రధాన జట్టులో కరోనా సోకిన ప్లేయర్ల స్థానంలో ఆడేందుకు అవకాశం ఇచ్చింది ఐసీసీ...
 

910

మార్చి 4న న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య జరిగే మొదటి మ్యాచ్‌తో ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభమవుతుంది... 

1010

టీమిండియా తన తొలి మ్యాచ్‌ను పాకిస్తాన్‌తో మార్చి 6న ఆడనుంది. ఆ తర్వాత మార్చి 10న న్యూజిలాండ్‌తో, 12న వెస్టిండీస్‌తో, 16న ఇంగ్లాండ్‌తో, 19న ఆస్ట్రేలియా, 22న బంగ్లాదేశ్‌లతో మ్యాచ్‌లు ఆడే టీమిండియా, మార్చి 27న దక్షిణాఫ్రికాతో ఆఖరి వన్డే ఆడుతుంది...

click me!

Recommended Stories