ఐపీఎల్ 2022 సీజన్‌లో కెప్టెన్ కంటే ఎక్కువ మొత్తం తీసుకుంటున్న ప్లేయర్లలో రవీంద్ర జడేజా ఒకడు. ఐపీఎల్ 2022 సీజన్ రిటెన్షన్‌లో ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్న జడ్డూకి రూ.16 కోట్లు చెల్లించనుంది సీఎస్‌కే...
న్యూజిలాండ్‌తో మొదటి టెస్టులో గాయపడి, దాదాపు మూడు నెలల పాటు క్రికెట్‌కి దూరంగా ఉన్న జడ్డూ, శ్రీలంకతో జరిగిన మొదటి టీ20 ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు..
210
కెరీర్ ఆరంభంలో రెండేళ్ల పాటు రాజస్థాన్ రాయల్స్‌కి ఆడిన రవీంద్ర జడేజా, ఆ తర్వాత ఎక్కువ ధర కోసం వేరే ఫ్రాంఛైజీలతో సంప్రదింపులు జరిపి, ఏడాది నిషేధానికి గురయ్యాడు...
310
2011లో కొచ్చి టస్కర్స్ కేరళ జట్టుకి ఆడిన రవీంద్ర జడేజా, 2012 నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌లో ఉన్నాడు. సీఎస్‌కేపై నిషేధం పడిన రెండేళ్లు గుజరాత్ లయన్స్‌కి ఆడాడు జడ్డూ...
410
చెన్నై సూపర్ కింగ్స్‌లో 10 ఏళ్లు పూర్తి చేసుకున్న రవీంద్ర జడేజా, సీఎస్‌కే గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు...
510
‘చెన్నై సూపర్ కింగ్స్ నాకు సొంత ఇల్లు లాంటిది. ఈ టీమ్‌లో ప్లేయర్లతోనే కాదు, ఫ్రాంఛైజీ ఓనర్లతోని కూడా నాకు ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది...
610
ఫ్రాంఛైజీలోకి వచ్చినప్పటి నుంచి నేను అడిగిన ప్రతీది కాదనకుండా సమకూర్చారు. మాహీ భాయ్ కూడా ఇక చెప్పాల్సిన అవసరమే లేదు...
710
నా క్రికెట్ కెరీర్‌కి మహీ భాయ్ పునాది వేశాడు. టీమిండియాకి ఆడినప్పటి నుంచి ఎంతో సపోర్ట్ చేశాడు. ఇప్పుడు చెన్నైకి నేను పూర్తిగా అలవాటు పడిపోయా...
810
ఎంతమంది ప్లేయర్లు ఉన్నా ఎమ్మెస్ ధోనీతో కలిసి ఆడుతుంటే ఆ మజాయే వేరుగా ఉంటుంది. అందుకే నా ఫెవరెట్ బ్యాటింగ్ పార్టనర్ మాహీయే...
910
జైపూర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నేను షాట్ కొట్టి పడిపోయిన తర్వాత సింగిల్ తీయకుండా బాల్ చూస్తూనే ఉండిపోయా... మాహీ భాయ్ వచ్చి నా హెల్మెట్‌పై బ్యాటుతో కొట్టాడు...
1010
మాహీ భాయ్‌తో ఇలాంటి చిలిపి, సరదా సంఘటనలు ఎన్నో ఉన్నాయి...’ అంటూ చెప్పుకొచ్చాడు సీఎస్‌కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా...