ఓ పక్క జస్ప్రిత్ బుమ్రా, మరో ఎండ్‌లో హర్షల్ పటేల్... టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీలో...

First Published Feb 26, 2022, 2:50 PM IST

ఐపీఎల్ 2021 సీజన్ పర్ఫామెన్స్ కారణంగా బౌలర్ హర్షల్ పటేల్ కెరీర్‌ పూర్తిగా మారిపోయింది. 2021 సీజన్‌కి ముందు కనీసం ఐపీఎల్‌లో తుది జట్టులో కూడా చోటు దక్కించుకోలేకపోయిన హర్షల్ పటేల్, ఇప్పుడు టీమిండియాకి మోస్ట్ వాంటెడ్ బౌలర్‌గా మారిపోయాడు...
 

ఐపీఎల్ 2021 సీజన్‌లో 15 మ్యాచుల్లో 32 వికెట్లు తీసి, ఒకే ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా డ్వేన్ బ్రావో రికార్డును సమం చేశాడు హర్షల్ పటేల్...

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్‌కి ఆ తర్వాత చెప్పుకోదగ్గ అవకాశాలు రాకపోయినా, హర్షల్ పటేల్ మాత్రం వచ్చిన అవకాశాలను చక్కగా వాడుకుంటున్నాడు...
 

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత న్యూజిలాండ్ సిరీస్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన హర్షల్ పటేల్, తొలి మ్యాచ్‌లోనే రెండు కీలక వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు..

ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.10.75 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి మరీ హర్షల్ పటేల్‌ను తిరిగి కొనుగోలు చేసింది హర్షల్ పటేల్..

వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ అద్భుతంగా బౌలింగ్ చేసి, భారత జట్టుకి విజయాలు అందించిన హర్షల్ పటేల్, డెత్ ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఇంప్రెస్ చేశాడు...

‘ జస్ప్రిత్ బుమ్రా ఇప్పటికే స్టార్ బౌలర్‌గా మారిపోయాడు. కాబట్టి అతని బౌలింగ్‌లో భారీ షాట్స్ ఆడడానికి ప్లేయర్లు కాస్త ఆలోచిస్తారు, జాగ్రత్తగా ఆడాలనే ఆలోచనతో ఉంటారు...

అయితే హర్షల్ పటేల్ అలా కాదు. హర్షల్ పటేల్ బౌలింగ్‌ వారికి పెద్దగా తెలీదు. ఐపీఎల్ ఆడినా, ఆ అనుభవం అన్ని చోట్లా పనికి రాదు.. దీన్ని హర్షల్ తనకి అడ్వాంటేజ్‌గా మలుచుకోవచ్చు...

డెత్ ఓవర్లలో వేరియేషన్స్ చూపిస్తూ వికెట్లు తీయడం హర్షల్ పటేల్ స్పెషాలిటీ. నా అంచనా ప్రకారం టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో బుమ్రాతో పాటు హర్షల్ పటేల్‌ను డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయిస్తే బెటర్...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్...

హర్షల్ పటేల్‌కి అవకాశం వస్తే, సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ లేదా దీపక్ చాహార్‌లలో ఒకరు టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి దూరంగా ఉండాల్సి ఉంటుంది...

జస్ప్రిత్ బుమ్రాతో పాటు ఆల్‌రౌండర్లుగా శార్దూల్ ఠాకూర్, వెంకటేశ్ అయ్యర్, రవీంద్ర జడేజాలకు టీమిండియాలో చోటు కన్ఫార్మ్. ఇక మిగిలిన స్పిన్నర్ పొజిషన్‌కి చాహాల్‌ ఎలాగూ ఉన్నాడు...

మరో పేసర్‌గా భువనేశ్వర్ కుమార్‌ను టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఆడించింది టీమిండియా. అయితే యూఏఈలో భువీ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు...

ఈసారి దీపక్ చాహార్‌కి టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కవచ్చని టాక్ నడుస్తోంది. బాల్‌తోనూ బ్యాటుతోనూ మెరుపులు మెరిపించే దీపక్ చాహార్‌ను పక్కనబెట్టి హర్షల్ పటేల్‌కి టీమిండియాలో చోటు కల్పించే అవకాశాలు తక్కువే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు..

click me!