Asia Cup : ఐసీసీకి పాకిస్తాన్ ఫిర్యాదు.. ఫైనల్ నుంచి భారత కెప్టెన్ సూర్యకుమార్ ఔట్..?

Published : Sep 26, 2025, 04:11 PM IST

Suryakumar Yadav: ఆసియా కప్ 2025 లో పాకిస్తాన్ తో జరిగిన గ్రూప్ మ్యాచ్ తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కామెంట్స్ పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ పూర్తయింది. సూర్య ఆసియా కప్ ఫైనల్ ఆడాతారా లేదా?

PREV
16
సూర్యకుమార్ యాదవ్ పై పీసీబీ ఫిర్యాదు.. వివాదం ఎలా మొదలైంది?

ఆసియా కప్ 2025లో భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌లు మైదానంలోనే కాక బయట కూడా హాట్ టాపిక్ గా మారాయి. సెప్టెంబర్ 14న గ్రూప్‌ దశలో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ను టీమిండియా చిత్తుగా ఓడించింది. 

భారత్ విజయం సాధించిన తర్వాత కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్ ఈ గెలుపును భారత సైన్యానికి, అలాగే పహల్గామ్‌ ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు అంకితం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ రంగు పులుముకున్నాయని ఆరోపిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఐసీసీకి అధికారికంగా ఫిర్యాదు చేసింది.

DID YOU KNOW ?
ఆసియా కప్ ఫైనల్ IND v PAK
ఆసియా కప్ చరిత్రలో ఇండియా 8 సార్లు ఛాంపియన్ నిలిచింది. 2025లో ఇండియా-పాకిస్తాన్ తొలిసారి ఫైనల్‌లో తలపడుతున్నాయి. ఇది 41 ఏళ్లలో మొదటిది సారి.
26
ఐసీసీ ముందు సూర్యకుమార్ యాదవ్ ఏం చెప్పారు?

దుబాయ్‌లో మ్యాచ్‌ రిఫరీ రిచీ రిచర్డ్సన్‌ సమక్షంలో పీసీబీ ఫిర్యాదు పై విచారణ జరిగింది. సూర్యకుమార్‌తో పాటు బీసీసీఐ సీఓఓ హేమాంగ్‌ అమిన్‌, ఆపరేషన్స్ మేనేజర్ సమర్‌ మలాపుర్కర్‌ కూడా హాజరయ్యారు. సూర్యకుమార్ తన వివరణలో, తన వ్యాఖ్యలు రాజకీయ ఉద్దేశంతో కాదని, దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల కుటుంబాలకు మద్దతుగా చేశానని స్పష్టం చేశారు.

36
సూర్యకుమార్ కామెంట్స్ పై ఐసీసీ ఏం నిర్ణయం తీసుకుంది? ఆసియా కప్ ఫైనల్ నుంచి తప్పిస్తారా?

సూర్యకుమార్ యాదవ్ పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఫిర్యాదు విచారణ తర్వాత ఐసీసీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఐసీసీ ఈ కేసులో లెవెల్-1 ఉల్లంఘన పరిధిలో విచారణ చేసింది. దీనిలో గరిష్ఠంగా మ్యాచ్ ఫీజులో 15% కోత ఉంటుంది. అయితే మ్యాచ్ రిఫరీ రిచర్డ్సన్ సూర్యకుమార్‌ యాదవ్ ను కేవలం హెచ్చరికతోనే విడిచిపెట్టారు. ఇకపై రాజకీయ అర్థాలను కలిగించే వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త పడాలని సూచించారు. 

ఇది భారత్ కు గుడ్ న్యూస్ గా మారింది. ఎందుకంటే పాకిస్తాన్ తో జరిగే ఆసియా కప్ ఫైనల్ లో సూర్యకుమార్ యాదవ్ ఆడతారు. మ్యాచ్ ఆడకుండా ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో మరోసారి పాక్ కు చెంపదెబ్బకొట్టినట్టు అయింది.

46
పాకిస్తాన్ ఆటగాళ్ల వివాదాస్పద హావభావాలు

సెప్టెంబర్ 21న జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాళ్లు హావభావాలతో వివాదం సృష్టించారు. ఓపెనర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్ హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత తన బ్యాట్‌ను మెషీన్‌ గన్‌లా ఊపుతూ సెలబ్రేట్ చేశారు. ఫాస్ట్‌ బౌలర్‌ హారిస్‌ రౌఫ్‌ మాత్రం బౌండరీ లైన్ వద్ద విమానం కూల్చినట్లుగా సంకేతం చేశారు. ఈ హావభావాలను భారత అభిమానులు అభ్యంతరకరంగా అభివర్ణించారు.

56
పీసీబీ - బీసీసీఐ ఫిర్యాదులపై తదుపరి చర్యలు

ఫర్హాన్ తన సంబరాలను ఆ క్షణికంలో జరిగిన భావోద్వేగంగా సమర్థించుకున్నప్పటికీ, ఐసీసీ దీనిని లైట్‌గా తీసుకోవడం లేదు. ఈ ఇద్దరు ఆటగాళ్లపై విచారణ జరగనుంది. ఇదే కేసు భవిష్యత్తులో క్రికెట్‌లో కొత్త మలుపుగా కూడా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు, బీసీసీఐ కూడా ఈ ఘటనపై అధికారిక ఫిర్యాదు చేసింది.

66
ఆసియా కప్ 2025 ఫైనల్‌కు ముందు పెరుగుతున్న ఉత్కంఠ

భారత్‌ ఇప్పటికే ఫైనల్‌ బరిలోకి ప్రవేశించింది. పాకిస్తాన్‌ బంగ్లాదేశ్‌పై విజయం సాధించి ఫైనల్‌ చేరింది. దీంతో సెప్టెంబర్ 28న దుబాయ్‌లో భారత్–పాకిస్తాన్ మళ్లీ తలపడనున్నారు. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో భారత్ పాకిస్తాన్ జట్లు రెండు సార్లు తలపడ్డాయి. రెండు సార్లు పాకిస్తాన్ ను భారత్ చిత్తుగా ఓడించింది. 

రెండు మ్యాచ్ లలోనూ కొత్త వివాదాలు వచ్చాయి. ఇప్పుడు మూడో మ్యాచ్.. అదికూడా ఫైనల్ కావడంతో రెండు జట్ల చుట్టూ సృష్టమైన వివాదాల మధ్య, ఆటగాళ్లు ఎలా తమ దృష్టి మళ్లీ క్రికెట్‌ మీదే కేంద్రీకరిస్తారో అన్నది అభిమానుల ఆసక్తిగా మారింది. అలాగే, ఆసియా కప్ ఫైనల్ లో మొదటిసారి భారత్, పాకిస్తాన్ లు తలపడుతున్నాయి. దీంతో మ్యాచ్ పై ఉత్కంఠ పెరిగింది.

Read more Photos on
click me!

Recommended Stories